KRAMP Teaser: నాన్‌స్టాప్ కిస్సింగ్స్.. K-RAMP టీజర్‌లో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం

నటుడు కిరణ్ అబ్బవరం తాజా చిత్రం 'KRAMP' టీజర్ నేడు విడుదలైంది. రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల కానుంది.

New Update
Kiran Abbavaraam KRAMP Teaser

Kiran Abbavaraam KRAMP Teaser

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం ‘k ramp’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలై యూత్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. 

Also Read :  ‘OG’ నుంచి పవన్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్.. వింటే గూస్‌బంప్సే

KRAMP Teaser Released

Also Read :  బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు ఘోర ప్రమాదం..

హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండా, శివ బొమ్మక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ప్రస్తుతం ఈ టీజర్‌కు యువత నుంచి మంచి స్పందన వస్తోంది.

టీజర్‌ బట్టి చూస్తే ఇది ఒక విచిత్రమైన, విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్‌ల మధ్య ఉండే లవ్ స్టోరీకి అదనంగా, ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, బోల్డ్ కిస్సింగ్ సన్నివేశాలు యూత్‌లో మరింత బజ్ క్రియేట్ చేశాయి. సినిమా మొత్తం కేరళలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. కిరణ్ అబ్బవరం వాడిన కొన్ని డైలాగ్స్ చాలా విభిన్నంగా, కొత్తగా ఉన్నాయి. 

ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ టీజర్‌కు యువత నుంచి మంచి స్పందన వస్తోంది. విభిన్న కథాంశాలతో ముందుకు వెళుతున్న కిరణ్ అబ్బవరం, ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు