Kiran Abbavaram: అనిరుధ్ మ్యూజిక్‌తో కిరణ్ అబ్బవరం భారీ సినిమా..!

యువ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, తమిళ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుంది. అంతేకాక, కిరణ్ తన తొలి వెబ్ సిరీస్‌గా ఒక పాలిటికల్ డ్రామా, శ్రీకాంత్ అడ్డాలతో మరో సినిమా కూడా ప్లాన్‌లో ఉంది.

New Update
Kiran Abbavaram

Kiran Abbavaram

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తాజా సినిమా K Ramp విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అక్టోబర్ 18న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా కిరణ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండి, సినిమా పై హైప్ పెంచుతున్నాడు.

Also Read: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్.. 

అనిరుధ్‌తో కలిసి పెద్ద ప్రాజెక్ట్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరణ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చాలా రోజులుగా వినిపిస్తున్న గాసిప్‌లపై క్లారిటీ ఇస్తూ తన కొత్త ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారని స్పష్టం చేశాడు.

ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుందని, తమిళ దర్శకుడు దీనిని హ్యాండిల్ చేయబోతున్నాడని కూడా వెల్లడించాడు. నిర్మాతలు త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్టు చెప్పాడు.

Also Read: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..

అనిరుధ్ రవిచందర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన అందించే ఎనర్జిటిక్ మ్యూజిక్ ట్రాక్స్‌తో ఇప్పటికే పలు సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అలాంటి మ్యూజిక్ మాస్టర్‌తో కిరణ్ చేయబోయే కాంబినేషన్ ఆయన కెరీర్‌కు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

కిరణ్ అబ్బవరం యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్, డైలాగ్ డెలివరీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఎనర్జీకి అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే, ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైనర్ అవుతోంది.

Also Read: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!

వెబ్ సిరీస్ కూడా రెడీ..

ఇంతకుముందు వెబ్ మీడియాలో అంతగా కనిపించని కిరణ్, తన తొలి వెబ్ సిరీస్‌ గురించి కూడా మాట్లాడాడు. ఇది ఒక పాలిటికల్ డ్రామా అని చెప్పాడు. అలాగే, "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నట్టు వెల్లడించాడు.

Also Read: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?

కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఒకవైపు K-Ramp విడుదలకు రెడీ అవుతుండగా, మరోవైపు అనిరుధ్ మ్యూజిక్‌తో భారీ సినిమా, వెబ్ సిరీస్‌, ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. త్వరలో ఈ కొత్త సినిమాపై మరిన్ని అప్‌డేట్లు రానున్నాయి.

Advertisment
తాజా కథనాలు