K-Ramp Teaser: టీజర్ లో బూతులు అందుకే పెట్టాం.. అబ్బవరం క్లారిటీ!

K-Ramp టీజర్‌లో కొన్ని బూతులు ఉండటంపై స్పందించిన కిరణ్ అబ్బవరం, అవి హీరో క్యారెక్టర్ ను చూపించడానికే ఉపయోగించామని, సినిమా మొత్తంలో అలాంటి పదాలు ఉండవని స్పష్టం చేశారు. కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని తెలిపారు.

New Update
K-Ramp Teaser

K-Ramp Teaser

K-Ramp Teaser:

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం K-Ramp ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండా, శివ బొమ్మక్కు కలిసి నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా 2025 అక్టోబర్ 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కథానాయికగా యుక్తి తారేజా నటిస్తున్నారు.

Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

ఇటీవల విడుదలైన టీజర్‌లో కొన్ని అశ్లీల పదాలు (cuss words) వినిపించడం ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. ఈ నేపథ్యంలో, మీడియాతో మాట్లాడిన సమయంలో ఓ జర్నలిస్ట్ ఈ విషయం కిరణ్ అబ్బవరంని అడిగారు. ఈ రకమైన డైలాగులు ఆయన "బాయ్ నెక్స్ట్ డోర్" ఇమేజ్‌కి నష్టం కలిగిస్తాయా? కుటుంబ ప్రేక్షకులను దూరం చేస్తాయా? అని ప్రశ్నించారు.

Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

దీనిపై స్పందించిన కిరణ్ అబ్బవరం, "మన హీరో పాత్ర ఎలా ఉండబోతున్నాడో చూపించేందుకు టీజర్‌లో కొన్ని పదాలను జోడించాం. కానీ సినిమాలో అలాంటి పదాలు దాదాపుగా ఉండవు. థియేటర్‌కి వస్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రైలర్ విడుదలయ్యే సరికి ఈ విషయంలో పూర్తి క్లారిటీ వస్తుంది. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఆహ్లాదంగా చూస్తారు. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది," అని చెప్పారు. మొత్తం మీద, K-Ramp కేవలం యువత మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకునేలా ఉంటుందని కిరణ్ అబ్బవరం స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు