Bandla Ganesh : ఓరెయ్ బండ్ల నీ నోటిదూల ఆపురా..  నువ్వో మెగా ఫ్యామిలీ కుక్క.. విజయ్ ఫ్యాన్స్ ఫైర్!

K.Ramp సక్సెస్ మీట్‌లో నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు ఒక్క హిట్ వస్తే చాలు లూస్ డ్రెస్, కొత్త చెప్పులు..వాట్సాప్..వాట్సాప్ అంటూ స్టైల్ పడతారంటూ ఎగతాళి చేశారు

New Update
bandla

K.Ramp సక్సెస్ మీట్‌లో నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు ఒక్క హిట్ వస్తే చాలు లూస్ డ్రెస్, కొత్త చెప్పులు..వాట్సాప్..వాట్సాప్ అంటూ స్టైల్ పడతారంటూ ఎగతాళి చేశారు. కిరణ్ అబ్బవరం రియల్ హీరో అని ప్రశంసించారు. నిజాయితీతో, కష్టపడి ఎదిగిన యువ హీరోల్లో కిరణ్ ముందున్నాడని కొనియాడారు. 

ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్‌లోని కొంతమంది యువ హీరోలను పరోక్షంగా బండ్ల గణేష్ విమర్శించారు. ఒక్క సినిమా హిట్ పడగానే కొందరు వాట్సాప్ హీరోలు అయిపోతున్నారు. అర్ధరాత్రి కళ్లద్దాలు, లూజ్ ప్యాంట్లు వేసుకుని నడుస్తున్నారు. కానీ కిరణ్ మాత్రం రియల్ హీరో అని చెప్పుకొచ్చారు. ఒక సినిమా హిట్ అయితేనే పెద్ద దర్శకుల పేర్లు చెప్పి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారు. కానీ కిరణ్ ప్రతి సినిమాను కొత్త దర్శకులతో చేశాడు. ఇది నిజమైన ధైర్యం  అని అన్నారు.

వాట్సాప్ అంటే కుదరదు

చిరిగిన ప్యాంట్ వేసుకుంటేనో, లాగు వేసుకుంటేనో.. వాట్సాప్ అంటే కుదరదు. వాస్తవానికి ద‌గ్గర‌గా ఉండాలని ఘాటుగా మాట్లాడారు. బండ్ల గణేష్ పేరు ప్రస్తావించకుండా చేసిన ఈ వాట్సాప్ హీరోలు వ్యాఖ్యలు హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించే చేశారని సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. గతంలో కూడా బండ్ల గణేష్ విజయ్ దేవరకొండను పరోక్షంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. విజయ్ ఫ్యాన్స్ కూడా అంతేస్థాయిలో బండ్ల గణేష్ పై ఫైర్ అవుతున్నారు. ఓరెయ్ బండ్ల నీ నోటిదూల ఆపురా..  నువ్వో మెగా ఫ్యామిలీ కుక్క అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. 

vijay tweet

Advertisment
తాజా కథనాలు