K-Ramp Censor: కిరణ్ అబ్బవరం 'K-Ramp'కు 'A' సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం నటించిన 'K-Ramp' అక్టోబర్ 18న విడుదల కానుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ కామెడీకి 'A' సర్టిఫికేట్ లభించింది. 140 నిమిషాల రన్‌టైమ్‌తో రానున్న ఈ చిత్రంలో యుక్తి తారేజా హీరోయిన్‌గా కనిపించనున్నారు.

New Update
K-Ramp Censor

K-Ramp Censor

K-Ramp Censor: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన తాజా సినిమా 'K-Ramp' ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ సినిమాతో దర్శకుడిగా జైన్స్ నాని పరిచయం అవుతున్నారు. హీరోయిన్‌గా యుక్తి తారేజా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

సెన్సార్ ఫినిష్.. 

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు CBFC ఈ సినిమాకు 'A' సర్టిఫికేట్ (అడల్ట్స్ ఓన్లీ) ఇచ్చింది. ఇది కొంత షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే, సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కచ్చితంగా కనెక్ట్ అయ్యే అంశం ఉందని హీరో కిరణ్ అబ్బవరం గతంలో చెప్పిన మాటలు అభిమానుల్లో ఆసక్తి కలిగించాయి.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

రన్‌టైమ్ ఎంతంటే?

K-Ramp సినిమాకు 140 నిమిషాల (2 గంటల 20 నిమిషాలు) రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఇది ఒక రొమాంటిక్-కామెడీ సినిమా దృష్ట్యా ఈ రన్‌టైమ్‌ బాగానే ఉందని చెప్పాలి. లైట్ హార్ట్ ఎంటర్‌టైనర్ కావడంతో ప్రేక్షకులు కథను త్వరగా అర్థం చేసుకునేందుకు ఈ షార్ట్ డ్యూరేషన్ ప్లస్ అవుతుందనే చెప్పాలి.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తారేజా జంటగా మెరవనున్నారు. అలాగే సాయి కుమార్, నరేశ్ విజయకృష్ణ, కామ్నా జెథమలాని, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేశ్ దండా, శివ బొమ్మక్కు కలిసి నిర్మించారు.

Also Read: రజనీకాంత్ "కూలీ" టీవీ ప్రీమియర్‌కు రెడీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?

దీపావళి కానుకగా రిలీజ్ కానున్న 'K-Ramp' రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో ఓ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌గా ముందుకొస్తుంది. అయితే 'A' సర్టిఫికేట్ ప్రేక్షకులని షాక్ కి గురి చేస్తుందా? లేక క్యూరియాసిటీ పెంచుతుందా? అన్నది చూడాలి!

Advertisment
తాజా కథనాలు