Israel: ఇజ్రాయెల్ బస్సుల్లో పేలుళ్లు..ఉగ్రవాదుల పనేనా?
వరుస పేలుళ్లు ఇజ్రాయెల్ ను వణికించాయి. అక్కడి బాట్ యామ్ సిటీలో మూడు బస్సుల్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ పని చేసింది పాలస్తీనా ఉగ్రవాదులేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
MK-84 Bombs: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!
అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు MK-84 బాంబులు చేరుకున్నాయి. 2000 ఫౌండ్ల MK-84 బాంబులు శనివారం రాత్రి ఇజ్రాయిల్‌లోని అష్డోడ్ ఓడరేవుకు చేరుకున్నాయి. వీటిని ఇజ్రాయిల్ సైన్యం వైమానిక స్థావరాలకు తరలిస్తోంది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం మొదలైంది.
Israel Warning: బందీలను విడిచిపెట్టకుంటే జరిగేది అదే.. హమాస్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్.. హమాస్ వద్ద ఉన్న బందీలను శనివారం నాటికి రిలీజ్ చేయాలని డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ వారం చివర్లో తమ బందీలను విడుదల చేయకుంటే యుద్ధం మళ్లీ ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
Gaza:గాజాకు కరవు తప్పింది కానీ...!
గాజాకు కరవు ముప్పు చాలా వరకు తప్పినట్లే.కాల్పుల విరమణకు ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం ఆకలి కేకలు తగ్గుముఖం పట్టాయి. అయితే పరిస్థితులు ఇంకా కుదుట పడాల్సి ఉందనిఐరాస మానవతావాద విభాగం చీఫ్ టామ్ ప్లెచర్ వెల్లడించారు.
Trump-Israel: ట్రంప్ నకు గోల్డెన్ పేజర్ బహుమతి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఒక బంగారు పేజర్ ను బహుమతిగా ఇచ్చారు.గతేడాది లెబనాన్,సిరియాల పై జరిగిన ఘోరమైన పేజర్ దాడులకు ఇది సూచన అని జెరూసలేం పేర్కొంది.
Trump: ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ ను మేం దెబ్బతీయడమా?
ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్‌ను దెబ్బతీసేందుకు అమెరికా పని చేస్తోందంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ట్రంప్ స్పందించారు.ఇరాన్ శాంతియుత అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నానని, కానీ ఇలాంటి రూమర్స్ నిజం కాదని అన్నారు.
Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!
నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో సాక్షులను బెదిరించారనే అభియోగాలను బెంజమిన్ సతీమణి సారా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పై నేర విచారణ చేస్తున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.
Donald Trump: ట్రంప్‌కు బిగ్‌షాక్ ఇచ్చిన అరబ్ దేశాలు
ట్రంప్‌కు అరబ్ దేశాలు షాకిచ్చాయి. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ప్రజలు నివసించే పరిస్థితులు లేవు. వాళ్లకి ఈజీప్టు, జోర్డాన్లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈజిప్డు, జోర్డాన్, సౌదీ అరేబీయా, యూఏఈ, ఖతర్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి.