/rtv/media/media_files/2025/06/10/x9pLDkKoXMTrJzc0W8iM.jpg)
Israel to strike Iran soon? Preparations for attack 'in final stages, Know Details
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందం వివాదం నడుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సంచలన విషయం బయటపడింది. ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌లోని కీలక ప్రదేశాలకు ఆయుధాలు తరలింపు జరగుతున్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు విదేశీ వ్యవహారాల నిపుణులు మేరీల్యాండ్‌లో క్యాంప్ డేవిడ్ ఆఫీసులో సమావేశమయ్యారు.
Also Read: బరితెగిచింది.. అక్రమ సంబంధం కోసం భర్త, పిల్లలకు స్లో పాయిజన్
ఈ భేటీలో ఇరాన్ విషయంలో అమెరికా చేపట్టాల్సిన వ్యూహార గురించి చర్చలు జరిపారు. అలాగే ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం నెతన్యాహు రక్షణశాఖ అధికారులు, కీలక మంత్రులతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరాన్‌లో అణుకేంద్రాలు, అణు ఆయుధాల ఉత్పత్తిలో ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు సహా ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
Also Read: గ్రెటా థన్‌బర్గ్‌కు షాక్.. వెనక్కి పంపిన ఇజ్రాయెల్
ఈ క్రమంలోనే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు రెడీ అవుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. దాడులు తీవ్రత ఎంతవరకు ఉంటుంది ? ఎప్పుడు దాడులు చేసే ఛాన్స్ ఉందనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఇజ్రాయెల్ తమపై దాడులకు దిగితే కౌంటర్ ఇచ్చేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆఖరికీ న్యూక్లియర్ ఆయుధాన్ని కూడా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే ఛాన్స్ ఉందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ తెలిపారు.
Also Read: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
Also Read: రష్యా ఐదేళ్లలో నాటో దేశాలపై దాడులు చేసే ఛాన్స్.. హెచ్చరించిన జనరల్ సెక్రటరీ