Iran Earthquake : ఇరాన్లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు!
జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు.
జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్స్‌లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇందులోకి అగ్రరాజ్యం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కాస్త బలహీన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇరాన్ వేరే రకంగా భయపెట్టడానికి చూస్తోంది. హర్మూజ్ జలసంధిని బూచిగా చూపిస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. దీంతో ఇరాన్ పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి అని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ మరిన్ని సమస్యల వలయంలో చిక్కుకోనుందని సమాచారం. వేర్పాటువాదులు దాడులకు సన్నద్ధమవుతున్నారని అంటున్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రతిరోజూ కొత్త మలుపులు తిరుగుతోంది. రెండు దేశాల మధ్య వివాదం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి భీకరంగా దాడి చేసుకుంటూనే ఉన్నాయి.
తన మాట వినని ఇరాన్‌ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్‌ను వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే పాకిస్తాన్‌తో స్నేహ్నం చేస్తున్నాడు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా పాక్‌ను దగ్గర తీస్తోందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంటున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 8వ రోజుకు చేరుకుంది.రెండు దేశాలు ఒక దానిపై ఇంకొకటి భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ అణు స్థావరాలపై అటాక్ చేస్తుంటే..ఇరాన్ మాత్రం ఆసుపత్రులు, భవనాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. తాజాగా క్లస్టర్ బాంబులను ప్రయోగించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికాతో పాటూ చైనా కూడా ఎంటర్ అవుతుందా అంటే అవుననే చెబుతున్నారు. చైనా బోయింగ్ విమానాలు ఇరాన్ లోకి వచ్చాయని యూఎస్ కు చెందిన ఫాక్స్ న్యూస్ చెబుతోంది. వారం రోజుల్లో ఐదు విమానాలు వచ్చాయని తెలుస్తోంది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండర్ మేజర్ జనరల్ మొహమ్మద్ పక్పూర్, బ్రిగేడియర్ జనరల్ మాజిద్ ఖాదామిని దాని ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిగా నియమించారు. గత వారం ఇజ్రాయెల్ దాడిలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ అలీ ఖమేనీ సంచలన ట్వీట్ చేశారు. అల్లాహ్ ఇరాన్‌కు విజయాన్ని అందిస్తాడని ఖురాన్ కోట్‌ను ట్వీట్లో తెలిపారు. దేవుడు సర్వ శక్తివంతుడు, కచ్చితంగా గెలుపును ఇరాన్‌కే ఇస్తాడని, ధైర్యంగా ఉండాలని దేశ ప్రజలకు ట్వీట్ ద్వారా సందేశం తెలిపారు.