Iran-Israel war: అంతిమ విజయం ఇరాన్‌దే.. ఖమేనీ సంచలన ట్వీట్

ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ అలీ ఖమేనీ సంచలన ట్వీట్ చేశారు. అల్లాహ్‌ ఇరాన్‌కు విజయాన్ని అందిస్తాడని ఖురాన్ కోట్‌ను ట్వీట్‌లో తెలిపారు. దేవుడు సర్వ శక్తివంతుడు, కచ్చితంగా గెలుపును ఇరాన్‌కే ఇస్తాడని, ధైర్యంగా ఉండాలని దేశ ప్రజలకు ట్వీట్ ద్వారా సందేశం తెలిపారు.

New Update
Iran will not surrender, Says Ayatollah Ali Khamenei

Ayatollah Ali Khamenei

ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ వార్ రోజురోజుకీ ముదురుతోంది. ఇరు దేశాలు కూడా డ్రోన్లు, క్షిపణులు దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ట్వీట్ చేశారు. అల్లాహ్‌ ఇరాన్‌కు విజయాన్ని అందిస్తాడని ఖురాన్ కోట్‌ను ట్వీట్‌లో తెలిపారు. దేవుడు సర్వ శక్తివంతుడు, కచ్చితంగా గెలుపును ఇరాన్‌కే ఇస్తాడని అన్నారు. సత్యానికి, సరైన వైపు ఉన్న వారిని మాత్రమే విజయం వరిస్తుంది.. భయపడుతున్నామని శత్రువు గ్రహిస్తే మనల్ని వదలడని అన్నారు. ఎప్పటిలాగే ధైర్యాన్ని కొనసాగించాలని ఖమేనీ దేశ ప్రజలకు ట్వీట్ ద్వారా సందేశం తెలిపారు.

ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?

క్షిపణులతో దాడులు..

ఇదిలా ఉండగా తాజాగా ఇజ్రాయెల్‌ పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది. బాంబులు పడటంతో పేషెంట్లు, డాక్టర్లు బయటకు పరుగులు పెట్టారు. అలాగే శిథిలాల కింద వందలాది మంది పేషెంట్లు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. '' మేము ఓ పద్ధతి ప్రకారం ఇరాన్‌లో అణు స్థావరాలను ధ్వంసం చేస్తున్నాం. మేము చేసే దాడులు వాళ్ల నష్టాన్ని మరింత పెంచుతున్నాయి. ఫలితంగా వాళ్ల బాలిస్టిక్‌ క్షిపణులు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని'' తెలిపారు. ఇప్పటిదాకా 70 ఇరాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ బ్యాటరీలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు