Trump: పాకిస్తాన్ భుజాలపై తుపాకి పెట్టి ఇరాన్‌కి దెబ్బ.. దిమ్మతిరిగిపోయే ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఇదే!

తన మాట వినని ఇరాన్‌ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్‌ను వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే పాకిస్తాన్‌తో స్నేహ్నం చేస్తున్నాడు. ఇజ్రాయిల్‌, ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా పాక్‌ను దగ్గర తీస్తోందని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంటున్నారు.

New Update
Pakistan Army Chief meets Trump

ఎత్తులను మించి పై ఎత్తులను వేయడంలో అమెరికా గుంటనక్కను మించిపోతుంది. మొన్నటి వరకు మోదీ నా ఫ్రెండ్ అన్న ట్రంప్. ఇప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌తో దోస్తీ కట్టాడు. టారిఫ్‌లు విధించడంలో కూడా ట్రంప్ భారత్‌పై కనికరం చూపలేదు. యూఎస్ ఆర్మీ వార్షికోత్సవాలకు అసిమ్ మునీర్ హాజరవుతారని వార్తలు రాగా.. దాన్ని అమెరికా ఖండించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్‌ అమెరికా పర్యటనలో విందు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత్, పాకిస్తాన్ విషయంలో అమెరికా ప్రాధాన్యతలు మారిపోయాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక పక్క పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల నేపథ్యంలో అసిమ్ మునీర్ అమెరికాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Also Read :  ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్‌ మీడియాలో దృశ్యాలు వైరల్‌

అమెరికా ఈక్వేషన్స్ మారాయి

జూన్ 18న అమెరికా అధ్యక్షుడు, పాక్ ఆర్మీ చీఫ్ ఇద్దరు కలిసి విందు చేశారు. ఈ సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పటి వరకూ భారత్, పాక్ యుద్ధం నేను ఆపాను అని చెప్పుకున్న ట్రంప్..  వీరి భేటీ తర్వాత ఆ రెండు దేశాల కాల్పుల విరమణ ఒప్పందంలో మోదీ, అసిమ్ మునీర్‌లే కీలకం అని ఇప్పుడు అంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్‌ను ట్రంప్ ఆ దేశం అధినేతతో పోల్చారు. పాకిస్తాన్ ప్రధాని స్థాయిలో ఆర్మీ చీఫ్‌ని పొగిడారు. పాకిస్తాన్‌లో పాలకులు నామమాత్రమే.. అధికారం అంతా ఆర్మీ చేతిలోనే ఉంటుంది అనే మాటలకు ఇది నిదర్శనం. అయినా ఓ దేశ అధ్యక్షుడు మరో దేశ అధ్యక్షుడినో, ప్రధానితోనో భేటీ కావాలి. కానీ ఇలా ఆర్మీ చీఫ్‌తో భేటీ అవ్వడం వెనుక అమెరికా ఎదో కుట్ర పన్నిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  జగన్ రప్పా.. రప్పా.. డైలాగ్ కు పవన్ కౌంటర్.. ఏమన్నారంటే?

బయటపడ్డ అమెరికా కుట్రకోణం

అమెరికా పాకిస్తాన్‌తో స్నేహం వెనుక పెద్ద స్కెచ్ ఉంది. ఇజ్రాయిల్‌తో యుద్ధంలో ఇరాన్ ట్రంప్ మాట విడనం లేదు. ఇరాన్‌తో పోరాడుతూ ఇజ్రాయిల్ సామర్థ్యాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అమెరికా ఏ క్షణంలోనైనా ఇజ్రాయిల్‌కు సపోర్ట్‌గా ఇరాన్‌పై ప్రత్యేక్షంగా దాడులకు దిగవచ్చు. ఈ సందర్భంలో పాకిస్తాన్‌ నుంచి ఇరాన్‌పై దాడి చేయాలనే ఆలోచనలో అమెరికా ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్, ఇరాన్‌తో బార్డర్ పంచుకున్న విషయం తెలిసిందే. 5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిం మునీర్ బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వైట్‌హౌస్ కేబినెట్ రూమ్‌లో వీరిద్దరి లంచ్ భేటీ జరిగింది. ఈ భేటీలో ఇస్లాంమిక్ దేశమైన ఇరాన్‌కు సపోర్ట్‌గా పాకిస్తాన్ రావద్దని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత్వం, ఆర్థిక సంక్షోభం ఆసారాగా చేసుకొని ఆదేశ పాలనా పగ్గాలు చేజిక్కిచ్చుకుందామని అసీమ్ మునీర్ చూస్తున్నారని తెలుస్తోంది. అందుకు ట్రంప్‌ హెల్త్ కోరడానికే అమెరికా పర్యటనకు వెళ్లినట్లు కొందరు చర్చించుకుంటున్నారు. ట్రంప్, అసీమ్ మునీర్‌ల మధ్య ఓ పెద్ద డీల్‌యే కుదిరిందని.. అందుకే ట్రంప్‌ పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అమెరికా అధ్యక్షుడు ఐ లవ్ పాకిస్తాన్ అని అన్నారని చెబుతున్నారు. 

Also Read :  ఎక్కువ మాట్లాడొద్దు.. కొండా మురళికి సొంత జిల్లా ఎమ్మెల్యేల వార్నింగ్!

ట్రంప్, అసిమ్ మునీర్ డీల్

పాకిస్తాన్‌ను పావుగా ఉంచి ఇరాన్‌ను మట్టుబెట్టాలని ట్రంప్ చూస్తుంటే.. ట్రంప్‌ను వాడుకొని పాకిస్తాన్‌లో పాలనాధికారాలు దక్కించుకోవాలని అసిమ్ మునీర్ ప్లాన్ వేశాడని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెప్పుకుంటున్నారు. ట్రంప్ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకునే ఎవరూ ఊహించలేరు. ఇజ్రాయిల్‌తో యుద్ధం విషయంలో ఇరాన్‌ వెనక్కి తగ్గాలని బెదిరించింది అమెరికా. అందుకు ధీటుగా ఇరాన్ సుప్రీం ఖమేనీ ఇజ్రాయిల్‌కు మద్దతుగా వస్తే అమెరికా మీద కూడా దాడులు చేస్తామని హెచ్చరించాడు. అదే క్రమంలో పాకిస్తాన్ తమకు సపోర్ట్‌గా ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తోందని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. పాక్ ఇరాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటానికే పాకిస్తాన్‌ను ట్రంప్ దగ్గరికి తీస్తున్నాడని ఓ చర్చ బయటకు వస్తోంది. 

Also Read :  తెల్ల బెర్రీలు డయాబెటిస్‌తోపాటు అనేక వ్యాధులను దూరం చేస్తాయి..!

 

47th us president donald trump | pak army chief asim munir | latest-telugu-news | iran-isreal-war | isreal attack iran news | isreal yemen war live | isreal target this leader | trump master plan

Advertisment
Advertisment
తాజా కథనాలు