Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ క్లారిటీ.. అమెరికాకి హామీ!

రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లు ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారాయి. మ్యూనిచ్ భద్రతా సదస్సులో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.

New Update
External minister Jai shankar says operation sindoor has not stopped

External minister Jai shankar says operation sindoor has not stopped

రష్యా(russia) నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లు ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్‌గా మారాయి. మ్యూనిచ్ భద్రతా సదస్సులో అమెరికా(america) విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. రష్యా ఇంధన ఆదాయాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కొత్త ఆంక్షలు విధిస్తున్న వేళ, రష్యన్ చమురు కొనుగోలు చేయమని భారత్ తమకు హామీ ఇచ్చిందని రూబియో పేర్కొన్నారు.

Also Read :  ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు.. పదేళ్లలో రూ.762 కోట్లా..?

S Jaishankar Gives Clarity On Russian Oil Purchases

అయితే, ఈ వ్యాఖ్యలపై రష్యా విరుద్ధంగా స్పందించింది. భారత్ తమ నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తుందని ఎక్కడా చెప్పలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ తమతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(s-jaishankar) భారత వైఖరిని అత్యంత చాకచక్యంగా వివరించారు. భారత విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. చమురు కొనుగోళ్లు(Indian oil purchases) అనేవి కేవలం రాజకీయ నిర్ణయాలు కావని, అవి మార్కెట్ ధరలు, అంతర్జాతీయ రిస్క్ ఫ్యాక్టర్లు, భారత కంపెనీల అవసరాలపై ఆధారపడి ఉంటాయని జైశంకర్ కుండబద్దలు కొట్టారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, తక్కువ ధరకే ఇంధనం లభించే అవకాశాలను వదులుకోబోమని ఆయన పరోక్షంగా సూచించారు.

క్లుప్తంగా చెప్పాలంటే, ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు రష్యాతో దీర్ఘకాలిక సంబంధాల మధ్య భారత్ తన "వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి" ని కాపాడుకుంటూ, దేశ ఇంధన భద్రతకే పెద్దపీట వేస్తోంది.

Also Read :  'త్రిషను వదిలేయ్ ముందు'.. విజయ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు