🔴Live News Updates: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బ్రెజిల్ సెంట్రల్ సావో పాలోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం నడిరోడ్డుపై కుప్పకూలింది. అదే సమయంలో రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకొందరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఢిల్లీ ప్రజలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా వంటి ప్రకటనలు అక్కడి ఓటర్లను ఆకట్టుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాషింగ్టన్ విమానం, హెలికాఫ్టర్ ఢీకొన్న సంఘటనలో అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. హెలికాఫ్టర్ ను ఎందుకు మళ్ళించలేకపోయారని అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు.
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు.అక్రమ వలసదారులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు అయిన గ్వాంటనామో బేలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకురావడం బైడెన్ ప్రభుత్వం వల్లనే ఆలస్యం అయిందని అంటున్నారు ఎలాన్ మస్క్. కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వ్యోమగాములను తొందరగా తీసుకురావాలని చెప్పారని మస్క్ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని షేక్ చేస్తున్న విషయం డీప్ సీక్. ఈ చైనా ఏఐ టూల్ ను తీసుకురావడానికి చాలా మందే కష్టపడ్డారు. కానీ వారందరిలో అతి ముఖ్యమైనది మాత్రం ఓ అమ్మాయి. ఆమె ఎవరో తెలియాలంటే.. కింది ఆర్టికల్ చదవాల్సిందే..
యాపిల్ యాప్ స్టోర్ లో ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరిన డీప్‌సీక్ యాప్..గూగుల్ ప్లేస్టోర్ లోనూ నంబర్ 1 స్థానంలో నిలిచింది.ఓపెన్ఏఐ రూపొందించిన చాట్‌జీపీటీ రెండో స్థానంలో ఉంది.