Indonesia: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్..100 మంది శిథిలాల కింద
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. దీని శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. ఒక విద్యార్థి మృతి చెందాడు.
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. దీని శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. ఒక విద్యార్థి మృతి చెందాడు.
గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. యుద్ధ ముగింపుకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఆయన ఒప్పుకున్నారు.
అమెరికాలో టెక్టాక్ యాప్ ఫీచర్ డిసైడ్ అయ్యింది. ఆ దేశంలో టిక్‌టాక్ సేవలు దేశీయ సంస్థలకు విక్రయించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో టెక్ దిగ్గజం ఒరాకిల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ కీలక పాత్ర పోషించనున్నాయి.
అమెరికాలోని నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్ చోటుచేసుకుంది. బీచ్ రెస్టారెంట్‌పై బోటులో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. నార్త్ కరోలినా తీర ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ వద్ద ఈ దారుణం జరిగింది.
వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. చైనా భూకంప నెట్వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం డింగ్సీ నగరంలోని లాంగ్జీ కౌంటీలో ఉదయం 5:49 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై గా నమోదైంది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని భారత్ మీద నిందలు వేస్తూ చాలా నాటకీయంగా మాట్లాడారు. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. భారత దౌత్య పేటల్ గెహ్లాట్ పాక్ ప్రధాని షెహబాజ్ కు ఇచ్చి పడేశారు.
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎపిస్టీన్. ఇతనికి సంబంధించిన కేసు ఫైళ్ళలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎలాన్ మస్క్ పేరు కూడా చేరింది.
హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్్లకు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం పై ఆయనకు గట్టి దెబ్బే తగలనుందని తెలుస్తోంది. దీనిపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైందని సమాచారం.
ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ లు సమావేశం అయ్యారు. అయితే ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నా ఆయన కోసం వారు చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలేం జరిగింది? ఎందుకు ట్రంప్ పాక్ ప్రధానిని అవమానించారు?