Indonesia: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్..100 మంది శిథిలాల కింద

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. దీని శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. ఒక విద్యార్థి మృతి చెందాడు.

New Update
indonesia

ఇండోనేషియా(indonasia) లో ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ లో నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది.  విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా పదులు సంఖ్యలో పిల్లలు గాయపడ్డారు.  100 మంది దాకా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని చెబుతున్నారు.  

Also Read :  లండన్ లో జాత్యాహంకారం...గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో పిచ్చిరాతలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

తూర్పు జావాలోని సిడోర్జో పట్టణంలోని అల్ ఖజోని ఇస్లామిక్ బోర్డంగ్ స్కూల్(Islamic Boarding School) లో ఈ ఘటన చోటు చేసుకుంది.  బిల్డింగ్ కూలిన ఎనిమిది గంటల తర్వాత పోలీసులు, రెస్క్యూ అక్కడకు చేరుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని ప్రాణాలతో బయటకు తీశారు.  అయితే చాలా మృతదేహాలను శిథిలాల కింద కూడా చూశామని రెస్క్యూ బృందం చెబుతోంది.   

Also Read :  అమెరికాలో టిక్‌టాక్ రీఎంట్రీ.. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు