Elon Musk: ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్...ఎపిస్టీన్ ఫైల్స్ లో బిలయనీర్ పేరు

అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎపిస్టీన్. ఇతనికి సంబంధించిన కేసు ఫైళ్ళలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎలాన్ మస్క్ పేరు కూడా చేరింది. 

New Update
Elon Musk And Trump

టెక్ అధిపతి, ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్.. ప్రస్తుతం ఇతని పేరు అమెరికా(america) లో మారుమోగుతోంది. దానికి కారణం మస్క్(Elon Musk) పేరు ఎపిస్టీన్ ఫైల్స్ లో కనిపించడమే.  ఇంతకు ముందు ఎపిస్టీన్ ఫైల్స్  లో అమెరికా అధ్యక్సుడు ట్రంప్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ లాంటి వారి పేర్లు కూడా కనిపించాయి. ట్రంప్ భార్య మెలానియాను కూడా జెఫ్రీ ఎపిస్టీనే పరిచయం చేశాడన్న వాదనలు కూడా వినిపించాయి.  జెఫ్రీ పాపాల్లో ట్రంప్ కు వాటా ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2003లో ఎపిస్టీన్  పుట్టిన రోజు కానుకగా ఒక లెటర్ రాశారని..WSJలో ఓ కథనం కూడా వచ్చింది.  

Also Read :  ఆపరేషన్ సిందూర్ దెబ్బకు వణికిపోతున్న పాక్.. POK నుంచి లష్కరే తోయిబా పరుగో పరుగు..!

ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడు...

ఇప్పుడు డెమోక్రటిక్ చట్ట సభ్యులు దీనిపఐ మరో కొత్త పత్రాన్ని విడుదల చేశారు. ఆరు పేజీల ఈ నివేదికలో ఎలాన్ మస్క్...2014లో వర్జిన్ దీవుల్లోని ఎపిస్టీన్ ద్వీపానికి వెళ్ళారని ఉంది. అక్కడ చాలా మంది మహిళలు తమను దుర్వినియోగం చేశాడని చెప్పారు.  అయితే దీనంతటినీ ఎలాన్ మస్క్ కొట్టిపారేశారు.  తనపై వస్తున్నకథనాలన్నీ అవాస్తవాలు అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. డెమోక్రాట్లు విడుదల చేసిన ఎప్స్టీన్ క్యాలెండర్ కాపీలలో, ఫిబ్రవరి 16, 2019న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మిత్రుడు స్టీవ్ బానన్ తో బ్రేక్ ఫాస్ట్ చేసినట్టు ఉంది. అలాగే డిసెంబర్ 5, 2014న బిల్ గేట్స్ కూడా అల్పాహారం చేశారని చెప్పబడింది. 

Also Read: India vs Srilanka: శ్రీలంకతో సూపర్ ఓవర్..అద్భుతమైన బౌలింగ్ తో గెలిపించిన అర్షదీప్

Advertisment
తాజా కథనాలు