TikTok: అమెరికాలో టిక్‌టాక్ రీఎంట్రీ.. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిన ట్రంప్

అమెరికాలో టెక్‌టాక్ యాప్ ఫీచర్ డిసైడ్ అయ్యింది. ఆ దేశంలో టిక్‌టాక్ సేవలు దేశీయ సంస్థలకు విక్రయించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో టెక్ దిగ్గజం ఒరాకిల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ కీలక పాత్ర పోషించనున్నాయి.

New Update
tiktok with trump

అమెరికాలో టెక్‌టాక్ యాప్ ఫీచర్ డిసైడ్ అయ్యింది. ఆ దేశంలో టిక్‌టాక్ సేవలు(TikTok in america) దేశీయ సంస్థలకు విక్రయించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో టెక్ దిగ్గజం ఒరాకిల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ కీలక పాత్ర పోషించనున్నాయి. చైనాకు చెందిన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌పై అమెరికా యూజర్ల డేటా భద్రత విషయంలో ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ఈ డీల్‌ను రూపొందించారు.

Also Read :  1+1 ఆఫరండీ బాబు.. మొబైల్ కొంటే టీవీ ఫ్రీ.. కొన్ని రోజులు మాత్రమే సమయం!

అసలు సమస్య ఏంటి?

టిక్‌టాక్ చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలో ఉంది. దీని ద్వారా అమెరికన్ యూజర్ల వ్యక్తిగత సమాచారం చైనా ప్రభుత్వానికి చేరే అవకాశం ఉందని, ఇది జాతీయ భద్రతకు ముప్పు అని అమెరికా నాయకులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024లో అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకురాగా, దాని ప్రకారం టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీలకు విక్రయించాలి లేదా ఆ దేశంలో నిషేధించాలని నిర్ణయించుకున్నారు.

Also Read :  చర్చ్‌లో దారుణం.. దుండగుడి కాల్పుల్లో నలుగురు మృతి

ట్రంప్ కీలక నిర్ణయం
ఈ చట్టం గడువు ముగుస్తున్న నేపథ్యంలో టిక్‌టాక్‌(TikTok) ను నిషేధించకుండా, అమెరికన్ నియంత్రణలోకి తీసుకురావడానికి అధ్యక్షుడు ట్రంప్ ఓ డీల్‌ను ఆమోదించారు. ఈ ఒప్పందం ద్వారా, ఒరాకిల్, సిల్వర్ లేక్ టెక్ కంపెనీలు టిక్‌టాక్ సేవల్లో అమెరికా మెజారిటీ వాటాను (దాదాపు 45% లేదా అంతకంటే ఎక్కువ) సొంతం చేసుకోనుంది. దుబాయ్‌కు చెందిన ఎంజీఎక్స్ ఫండ్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌కు మైనారిటీ వాటా (20% కంటే తక్కువ) మాత్రమే ఉంటుంది.

ఒరాకిల్ పాత్రే కీలకం:
ఈ డీల్‌లో ఒరాకిల్ పాత్ర అత్యంత కీలకం. అమెరికన్ యూజర్ల డేటా అంతా పూర్తిగా అమెరికాలోని ఒరాకిల్ క్లౌడ్ సర్వర్‌లలో భద్రపరచబడుతుంది. అంతేకాకుండా, టిక్‌టాక్ అత్యంత ముఖ్యమైన ఆల్గరిథమ్ పై నియంత్రణ, భద్రతా పర్యవేక్షణ కూడా ఒరాకిల్‌కు దక్కుతుంది. ఈ విధంగా, అమెరికన్ల డేటా చైనా ప్రభుత్వానికి అందుబాటులో లేకుండా చూసేందుకు ఈ ఏర్పాటు చేశారు.

ఈ ఒప్పందం ద్వారా, అమెరికన్ల ఫేమస్ యాప్‌ను కాపాడుకోవడంతో పాటు, జాతీయ భద్రతా ఆందోళనలను పరిష్కరించినట్లైందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ టేకోవర్ ద్వారా అమెరికన్ పెట్టుబడిదారులు, ఉద్యోగుల ప్రయోజనాలు కూడా రక్షించబడతాయని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి అమెరికన్ నియంత్రణతో టిక్‌టాక్ అమెరికాలో తన కార్యకలాపాలను కొనసాగించనుంది.

Advertisment
తాజా కథనాలు