Mass Shooting: బీచ్‌లో రెస్టారెంట్‌పై కాల్పులు.. ముగ్గురు మృతి

అమెరికాలోని నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్ చోటుచేసుకుంది. బీచ్ రెస్టారెంట్‌పై బోటులో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. నార్త్ కరోలినా తీర ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ వద్ద ఈ దారుణం జరిగింది.

New Update
Bullet firing

Bullet firing

అమెరికాలోని నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్(mass shootings usa) చోటుచేసుకుంది. బీచ్ రెస్టారెంట్‌పై బోటులో వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది. నార్త్ కరోలినా తీర ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ వద్ద ఈ దారుణం జరిగింది. రెస్టారెంట్‌లో ప్రజలు భోజనం చేస్తుండగా బోటులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. రెస్టారెంట్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల వివరాలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. పలువురు గాయపడినట్లుగా కూడా సమాచారం.

Also Read :  UNలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఫైర్.. ‘కొన్ని దేశాల్లో వాటిని వ్యాక్టరీల్లా నడుపున్నారు’

Mass Shootings North Carolina

Also Read :  పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడ్డ జనం..పీవోకేలో నిరసనలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుడు కాల్పులు జరిపిన అనంతరం బోటులో అక్కడి నుండి పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, తీర రక్షక దళంతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు వ్యక్తిగత పగలు కారణమా లేక ఉగ్రవాద చర్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కాల్పులకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో నార్త్ కరోలినా తీర ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు