/rtv/media/media_files/2025/09/27/india-pak-2025-09-27-10-10-31.jpg)
గురువారం నాడు పాకిస్తాన్(pakistan) ప్రధాని షెహబాజ్ చాలా చాలా ఎక్కువ మాట్లాడారు. ఇందులో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిందని... అదొక యుద్ధ చర్యని అభివర్ణించారు. ఇండియా ఈ విషయంలో ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. సింధూ జలాలపై పాక్ ప్రజలకు విడదీయరాని హక్కు ఉందని, దాన్ని కాపాడుకుంటామంటూ వ్యాఖ్యలు షెహబాజ్ వ్యాఖ్యలు చేశారు.
Also Read : I Love Muhammad Row: ఐ లవ్ ముహమ్మద్ అల్లర్లలో 30 మంది అరెస్ట్
నాటకాలొద్దు..దమ్ముంటే ఉగ్రవాదులను అప్పగించండి..
పాక్ ప్రధాని మాటలను అదే ఐక్యరాజ్య సమితిలో బారత దౌత్య వేత్త పేటల్ గెహ్లాట్ చాలా గట్టిగా తిప్పికొట్టారు. షెహబాజ్(shehbaz-sharif) చాలా బాగా యాక్టింగ్ చేశారని...ఆయన మాటలు అన్నీ నాయకీయపరంగా ఉన్నాయని పేటల్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్న ఆయన వారి విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని పొగిడినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయిన ఆ దేశం అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడదని అన్నారు. కానీ వారి అసలు నిజాలను వారి అబద్ధాలు దాచలేవని పేటల్ కామెంట్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెబుతూనే లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన సంగతి మర్చిపోకూడదని పేటల్ అన్నారు.
పహల్గాం దాడి తర్వాత జరిగిన యుద్ధాన్ని పాకిస్తానే ఆపాలని కోరింది. పాక్ సైన్యం భారత్ ను వేడుకుంది. ఆ విషయం ప్రధాని షెహబాజ్ మర్చిపోయి మాట్లాడుతున్నారని పేటల్ అన్నారు. ఇండియాలో అమాయక పౌరులపై జరిగిన దాడికి పాక్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ దేశం నిజంగానే శాంతిని కోరుకుంటే పాక్ లో ఉన్న ఉగ్రవాదులందరినీ తీసుకొచ్చి భారత్ కు అప్పగించాలని అన్నారు. అణు బెదిరింపులతో ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని భారత్ ఎప్పటికీ సహించదని, అలాంటివాటికి తలొగ్గదని స్పష్టంచేశారు. రన్ వేలు, హ్యాంగర్లను ధ్వంసం చేయడం విజయం అనుకుంటే అంత కంటే బుద్ధి తక్కువ లేదని ఎద్దేవా చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న సమస్యలను తమ రెండు దేశాలై పరిష్కరించుకుంటాయని... దీనిలో మరే ఇతర దేశం జోక్యం అవసరం లేదని పేటల్ నొక్కి చెప్పారు.
Also Read : Lashkar-e-Taiba: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు వణికిపోతున్న పాక్.. POK నుంచి లష్కరే తోయిబా పరుగో పరుగు..!