Boat Accident: సముద్రంలో ఘోర ప్రమాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి
ఆఫ్రికాలోని మొజాంబిక్ బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.
ఆఫ్రికాలోని మొజాంబిక్ బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.
ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా 300 డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి చేసింది. దీని వలన కీవ్ సహా 8 ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.
హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ప్రభుత్వం . దీన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఇది ట్రంప్ అధికార పరిధిని మించినదని దావాలో చెప్పింది.
హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమౌతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గాజా శాంతి ఒప్పందం తర్వాత హమాస్ సృష్టిస్తున్న రక్తపాతంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అంతర్గత హింసను ఆపకపతే...సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఇందులో పాకిస్తాన్ సైన్యం బట్టలు ఊడదీసి మరీ తరిమి తరిమి కొడుతోంది తాలిబాన్ సైన్యం.
భారత్, అమెరికా సంబంధాలను అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థం కోసమే చెడగొడుతున్నారంటూ డొమోక్రాట్ లీడర్, మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈగో, పాకిస్తాన్ డబ్బులే ఈపని చేయిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.
నాలుగు రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు దాడులు చేసుకుంటున్నాయి. దీని కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి..భారత్ తరుఫున ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు.