/rtv/media/media_files/2025/10/10/trump-2025-10-10-18-11-57.jpg)
Trump
ఇజ్రాయెల్, హమాస్(israel-hamas) ల మధ్య గాజా శాంతి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరువైపులా బందీలు విడుదల అయ్యారు. కాల్పుల విరమణకు అంగీకరించారు. అలాగే ఇజ్రాయెల్ సైన్యం గాజాను వదిలిపెట్టడానికి ఒప్పుకుంది. ఇదంతా జరిగి వారం రోజులు అవ్వలేదు...గాజాలో హమాస్ రక్తపాతం మొదలెట్టింది. కాల్పుల విరమణ తర్వాత హమాస్ ప్రత్యర్థి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ అందరినీ చంపేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది దాకా హతమార్చింది. హమాస్ గాజాలో హింసాత్మకంగా ప్రవర్తిస్తోంది. ఇజ్రాయెల్ గూఢచారులనే అనుమానంతో గాజాలో పాలస్తీనియన్లను ఊచకొత కోస్తోంది. శాంతి ఒప్పందం తర్వాత హమాస్ ఇప్పటి వరకు 50మంది చంపింది. ఇజ్రాయెల్‌తో కుమ్మక్కయ్యారనే అనుమానంతో ఆ బృందం డజన్ల కొద్దీ ప్రత్యర్థి మిలీషియా సభ్యులను కాల్చి చంపింది. గాజా అంతర్గత భద్రతను హమాస్ చేపట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(america president donald trump) ప్రకటించిన కొద్దిసేపటికే ఇది జరగడం గమనార్హం.
Also Read : బుడాపెస్ట్‌లో పుతిన్ ను కలుస్తా యుద్ధం గురించి చర్చిస్తా..ట్రంప్
మాకు అది తప్ప ఇంకో ఆప్షన్ లేదు..
దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. హమాస్ సృష్టిస్తున్న మారణహోమం మీద వచ్చిన నివేదికలను చూశానని...అంతర్గత రక్తపాతం ఆపకపోతే వారిని చంపడానికి వేరే మార్గం ఉండదని హెచ్చరించారు. మాకు లోపలికి వెళ్ళ హమాస్‌ను చంపడం తప్ప వేరే మార్గం లేదని ట్రంప్ అన్నారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేయడం చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్గత హింస గురించి తాము తక్కువ అంచనా వేశామని...ఇప్పుడు వారు మేము అనుకున్న దానికంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం గాజాలో హమాస్ చెడ్డ ముఠాలను మాత్రమే తుడిచిపెట్టిందని తెలుస్తోందని..అంతకు వరకూ తనకు సమస్య లేదని..కానీ దానిని మించి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పారు. వారు త్వరలోనే నిరాయుధులు అవుతారు. అలా చేయకపోతే మేము వారిని బలవంతంగా నిరాయుధులను చేస్తామని. తర్వాత అది బహిరంగ హింసగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రంప్ అన్నారు.
🔴 *TRUMP:* If Hamas continues to kill people in Gaza, which was not the Deal, we will have no choice but to go in and kill them.
— Lara Logan (@laralogan) October 17, 2025
How does this end? pic.twitter.com/bHaZgZEDpg
మరోవైపు గాజాలో శాంతి ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి అమెరికాతో పాటూ భాగస్వామి దేశాలు తమ బృందాలను అక్కడకు పంపిస్తున్నారు. అమెరికా నుంచి 200 మంది సైనికులు ఇజ్రాయెల్ కు వెళుతున్నారు. అయితే వీరు గాజాలో మాత్రం అడుగు పెట్టరని వైట్ హౌస్ చెబుతోంది.
Also Read: Telangana: ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే..కేబినెట్ నిర్ణయం