Putin-Trump: బుడాపెస్ట్‌లో పుతిన్ ను కలుస్తా యుద్ధం గురించి చర్చిస్తా..ట్రంప్

హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమౌతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చిస్తానని చెప్పారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

New Update
trump-putin

Donald Trump-Vladimir Putin

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సుదీర్ఘమైన ఫోను సంభాషణ జరిగిందని ట్రంప్(america president trump) తెలిపారు. ఇది చాలా ప్రయోజనకరంగా సాగిందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇది పెద్ద పురోగతి అని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్టీ శాంతి విషయంలో పుతిన్ తనను అభినందించారని చెప్పారు. శతాబ్దాలుగా కలలు కంటున్న విషయం ఇదేనని ఆయన అన్నారు. గాజా శాంతి ఒప్పందం రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపేందుకు ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు.  దీని తరువాత హంగేరీ రాజధాని బుడాపెస్ట్ చర్చల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. అక్కడ కూడా వార్ గురించి చర్చిస్తామని...దాంతో నైనా నాలుగేళ్ళుగా సాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.  వచ్చే వారం అమెరికా, రష్యా ఉన్నత సలహాదారు స్థాయి సమావేశం జరగనుందని తెలిపారు. మార్కో రూబియో దీనికి అమెరికా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని ట్రంప్ తెలిపారు.    

Also Read :  హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్

వాణిజ్యంపైనా చర్చలు..

ఫోన్ సంభాషణలో ఉక్రెయిన్ తో యుద్ధం ముగిశాక అమెరికా, రష్యాల మధ్య జరిగే వాణిజ్యం గురించి కూడా చర్చించామని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడు పుతిన్, నేను హంగేరీలోని బుడాపెస్ట్‌లో అంగీకరించిన ప్రదేశంలో సమావేశమవుతాము అని చెప్పారు. అలాగే శుక్రవారం ఓవల్‌ ఆఫీసులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తాను భేటీ కానున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఇందులో పుతిన్ తో ఫోన్ సంభాషణ గురించి కూడా జెలెన్ కు చెప్తానని ట్రంప్ తెలిపారు. నివేదికల ప్రకారం.. ట్రంప్ - పుతిన్ ఫోన్ సంభాషణ రెండు గంటలకు పైగా కొనసాగిందని తెలుస్తోంది. ఆగస్టు 15న అలస్కాలో ఇద్దరు నాయకుల భేటీ తర్వాత జరిగిన సుదీర్ఘ సంభాషణ ఇదే.

Also Read: Kohli Autograph: హుర్రే...కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరికింది..ఆనందంతో కిందపడి దొర్లిన పిల్లాడు..వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు