/rtv/media/media_files/2025/10/16/khawaja-2025-10-16-09-05-42.jpg)
Khawaja Asif, Pakistan Difence Minister
దాదాపు వారం రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లమధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. పాక్ సైన్యం ఆఫ్ఘానిస్తాన్ పై దాడికి దిగింది. ఇందుకు ప్రతిగా తాలిబన్లు కూడా దాడులు చేస్తున్నారు. సరిహద్దుల్లో ఇరు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఘర్షణలో దాదాపు 40మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది.
Also Read : ఐటీ ఉద్యోగులకు మరో షాక్.. దిగ్గజ కంపెనీలో మళ్లీ లేఆఫ్‌లు
నోటికొచ్చినట్టు మాట్లాడిన ఖ్వాజా ఆసిఫ్..
ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నోరు పారేసుకున్నారు. భారత్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ తరుఫున ఆఫ్గాన్ ఈ దాడులు చేస్తోందంటూ అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు పరోక్ష యుద్ధం చేస్తున్నారంటూ భారత్ పై నిందలు వేశారు. దీంతో పాటూ 48 గంటల కాల్పుల విరమణ మీద కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కూడా కాబూల్ లో కాకుండా ఢిల్లీలో తీసుకున్నారని అన్నారు. రీసెంట్ గా ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ అందుకే భారత్ లో పర్యటించారని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఈ దాడుల ప్లాన్ కూడా ఉందంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. చివరగా ఈ దాడులను మరింత తీవ్రతరం చేయొద్దంటూ ఆఫ్ఘాన్ కు ఆసిఫ్ హెచ్చరికలు జారీ చేశారు.
#BREAKING: Big allegation by Pakistan’s Defence Minister Khawaja Asif against Taliban and India.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 16, 2025
“Taliban is fighting India’s proxy war against Pakistan. Their decisions are being sponsored by New Delhi”, responding to a question on whether Afghanistan-Pakistan ceasefire will… pic.twitter.com/VKnDWU62gd
అంతకు ముందే పాక్, ఆఫ్ఘాన్ దేశాలు 48 గంటల కాల్పుల విరమణకు అంగీకించాయి. తాలిబన్లు కోరితే తాము ఈ ఒప్పందానికి వచ్చామని పాక్..ఆదేశం అడిగితేనే తాము ఒప్పుకున్నామని రెండు దేశాలు చెప్పుకున్నాయి. ఇంతా చేస్తే అది కూడా కేవలం నోటి మాట కిందనే ఉండిపోయింది. కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్, ఆఫ్గాన్ లు ఘర్షణ పడ్డాయి. బోర్డర్ వెంబడి పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా అఫ్గాన్ తాలిబన్లను హతమార్చామని పాక్ సైన్యం తెలిపింది. బలోచిస్తాన్ ప్రాంతంలో తాలిబ్లు దాడులకు తెగబడ్డారని..సామాన్యుల మీద కూడా కాల్పులు జరిపారని పాక్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగానే తాము దాడులను నిర్వహించామని చెప్పింది. ఈ ఘర్షణల్లో నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ముష్కరుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో కూడా ఆఫ్ఘాన్లు పోస్టులను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారని చెప్పింది.
Also Read: PAK-AFGHAN WAR: 48 గంటల కాల్పుల విరమణ తర్వాత కూడా ఘర్షణలు..పదుల్లో మరణాలు