H1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్

హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ప్రభుత్వం . దీన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఇది ట్రంప్ అధికార పరిధిని మించినదని దావాలో చెప్పింది. 

New Update
trump h1b visa

యూఎస్ హెచ్ 1బీ వీసా(h1b visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చాలానే గందగోళం రేగింది. భారత్, చైనా దేశాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. దాంతో పాటూ లాటరీ విధాన్ని తీసేస్తామని కూడా ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం.  దీని వలన అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలే నష్టపోతాయన్నది వాస్తవం. అయితే ఇప్పటి వరకూ ఏ కంపెనీ కూడా ట్రంప్ ను హెచ్ 1బీ వీసాల విషయమై ప్రశ్నించలేదు.

Also Read :  మరో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!

చాలా కష్టమౌతోంది..

అయితే ఇప్పుడు 3లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) పై దావా వేసింది. ఆయన అధికార పరిధికి మించి నిర్ణయాన్ని తీసుకున్నారని అందులో ఉటంకించింది. డీసీలోని ఫెడరల్ కోర్టులో ఈ దావా ఫైల్ అయింది. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వలన చాలా కంపెనీలు నష్టపోతున్నాయని...తక్కవు నైపుణ్యం కలవారిని నియమించుకోవాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాదు ఈ నిర్ణయం వలన హెచ్‌-1బీ ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి పెట్టుబడిదారులతో పాటు కస్టమర్‌లు, సొంత ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాదించింది. 

Also Read :  ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద డ్రోన్ల దాడి..అంధకారంలో ఎనిమిది ప్రాంతాలు

ఛాంబర్ ఆఫ్ కామర్స్..

అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలతో సహా దేశంలోనే అత్యధిక కంపెనీల సభ్యత్వం కలిగిన వ్యాపార సంస్థల లాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇదిపోరాటంలోకి దిగితే ఎదురు నిలబడడం కాస్త కష్టమే.  ఇప్పటి వరకు టెక్ కంపెనీలు విడిగా ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  ఒకవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గనుక కేసు వేస్తే, ట్రంప్ తో వీరు కోర్టులో పోరాడటం ఇది రెండోసారి అవుతుంది.  ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేశారు. అప్పుడు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై ఫెడరల్ కోర్టు కేసు వేసి గెలిచింది.  ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది.

ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై దాదాపు అన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  హెచ్ 1బీ వీసాతో టెక్ కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించకుంటున్నాయని...దాని వలన అమెరికాలో జనాలకు ఉద్యోగాలు తక్కువ అయిపోతున్నాయన్నది ట్రంప్ వాదన. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయంవలన అమెరికా ప్రజలతో పాటూ టెక్ కంపెనీలు కూడా సంతోషిస్తాయని అన్నారు. కానీ నిజానికి అవన్నీ కూడా ఈ నిర్ణయంపై విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  కంపెనీల సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉందని భయపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరటానికి సిద్ధమయ్యాయని తెలుస్తోంది. దీంతో పాటూ పలు సంఘాలు కూడా హెచ్ 1బీ వీసా ఫీజులకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. 

Also Read: Putin-Trump: బుడాపెస్ట్‌లో పుతిన్ ను కలుస్తా యుద్ధం గురించి చర్చిస్తా..ట్రంప్

Advertisment
తాజా కథనాలు