Boat Accident: సముద్రంలో ఘోర ప్రమాదం.. బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి

ఆఫ్రికాలోని మొజాంబిక్‌ బెయిరా ఓడరేవు సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.

New Update
3 Indians Dead, 5 Missing After Boat Capsizes Off Mozambique’s Beira Port

3 Indians Dead, 5 Missing After Boat Capsizes Off Mozambique’s Beira Port

ఆఫ్రికా(africa) లోని మొజాంబిక్‌ బెయిరా ఓడరేవు(Mozambique’s Beira Port) సమీపంలో బోటు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ విషాద ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. 14 మంది భారతీయ సిబ్బందితో సహా మరికొందరు ఆ బోట్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిగిలిన వాళ్లని స్థానిక సిబ్బంది రక్షించారు. అయితే బోటు బోల్తా పడేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. గల్లంతైన వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 

Also Read: మంటల్లో కాలిబూడిదైన ట్రైన్.. గజగజ వణికిపోయిన ప్రయాణికులు

Boat Accident At Mozambique’s Beira Port

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నట్లు భారత హైకమిషన్ పేర్కొంది. అలాగే మృతుల కుటుంబాలకు, వాళ్లకి కావాల్సిన సాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. మృతుల పేర్లు, వివరాలపై ఇంకా స్పష్టత లేదు. గల్లంతైన వాళ్ల కోసం స్థానిక అధికారుల, సముద్ర సంస్థలతో పాటు భారత దౌత్య కార్యాలయం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి అత్యవసర నెంబర్లను కూడా హైకమిషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read: ఆహారంలో వెంట్రుకలు.. ప్రయాణికుడికి రూ.35వేలు పరిహారం

Advertisment
తాజా కథనాలు