USA: ఈగో, పాక్ డబ్బుల కోసం భారత్ తో ట్రంప్ గొడవ..టాప్ డెమొక్రాట్ లీడర్ ఆరోపణ

భారత్, అమెరికా సంబంధాలను అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థం కోసమే చెడగొడుతున్నారంటూ డొమోక్రాట్ లీడర్, మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈగో, పాకిస్తాన్ డబ్బులే ఈపని చేయిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు.  

New Update
trump-shehabaz

ఈ మధ్య కాలంలో భారత్ కు అమెరికా(america) దూరం అయింది. అ క్రమంలో ఆ దేశం పాకిస్తాన్(pakistan) చాలా దగ్గర అయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని యూఎస్ మాజీ రాయబారి, డెమోక్రాట్ లీడర్ రహమ్ ఇమాన్యూయేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఈగో, పాకిస్తాన్ దగ్గర ఉన్న డబ్బులు కోసమే అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) చేశారని ఆరోపించారు. చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్ సహాయం అవసరం. ఈ విషయంలో ఇండియా అత్యంత కీలకైన భాగస్వామి...దీన్ని ట్రంప్ మర్చిపోయారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు అహంకారంతో ప్రవర్తిస్తున్నారంటూ రహమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని కోసమే 50 ఏళ్ళుగా భారత్, అమెరికా ల మధ్య ఉన్న వ్యూహాత్మక, దౌత్య సంబంధాలను తుంగలోకి తొక్కారంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ చేసింది తానేనంటూ ట్రంప్‌ చేసిన వాదనను భారత ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. మరోవైపు  పాకిస్తాన్ నుంచి ట్రంప్‌ కుమారుడికి భారీ మొత్తంలో డబ్బు అందుతోంది అని...అందుకే భారత్ సంబంధాలు ఆయన చెడగొడుతున్నారని రహమ్ ఆరోపించారు. 

Also Read :  భారత్ తరపున ఆఫ్ఘాన్ యుద్ధం..నోరు పారేసుకున్న పాక్ మంత్రి

మాజీ జాతీయ భద్రతా సలహాదారు కూడా..

ఈ విషయంపై ఇంతకు ముందు బైడెన్ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జేక్ సల్లివన్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల ప్రయోజనాల కోసం భారత్‌తో ఉన్న సంబంధాలను త్యాగం చేశారని అన్నారు. పాకిస్థాన్‌లో ట్రంప్ కుటుంబానికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వ్యాపారమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. జేక్ సల్లివన్ ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కరెన్సీ సంస్థ, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ WLF సంస్థలో 60 శాతం వాటా డొనాల్డ్ ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్‌లకు సంబంధించినదని చెప్పారు.  

ట్రంప్‌ కుటుంబ క్రిప్టో సంస్థతో పాక్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. వరల్డ్‌ లిబరేషన్ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కంపెనీలో ట్రంప్‌ కుటుంబానికి 60 శాతం వాటా ఉంది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన పాకిస్థాన్‌ క్రిప్టో కౌన్సిల్‌తో ఈ వరల్డ్‌ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థలో ట్రంప్‌ కుమారులు ఎరిక్, డొనాల్డ్‌ జూనియర్‌కు పెట్టుబడులు ఉన్నాయి. అయితే ఇస్లామాబాద్‌ను దక్షణాసియాలోనే క్రిప్టోలకు కీలకమైన హబ్‌గా మార్చే లక్ష్యంతో పాక్‌ కొన్నివారాల క్రితం ఈ క్రిప్టో కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. తమ ప్రజల్లో క్రిప్టోలపై తమ ప్రయత్నానికి నమ్మకం కలిగించాలని పాక్ నిర్ణయించింది.

Also Read :  48 గంటల కాల్పుల విరమణ తర్వాత కూడా ఘర్షణలు..పదుల్లో మరణాలు

Advertisment
తాజా కథనాలు