Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద డ్రోన్ల దాడి..అంధకారంలో ఎనిమిది ప్రాంతాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. మరో వైపు రష్యా ఉక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. తాజాగా 300 డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి చేసింది. దీని వలన కీవ్ సహా 8 ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. 

New Update
ukraine war

ఎవరెన్ని చెప్పినా..ఆను మాత్రం అనుకున్నది సాధించే వరకు పట్టు వదలను అన్నట్టు తయారయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్(putin). వేల మంది ప్రాణాలు పోతున్నా..ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ఈరోజు కూడా పుతిన్‌తో మాట్లాడా..యుద్ధ ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి అని ప్రకటించారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తూ మాత్రం వేరేలా ఉంది. రష్యా..ఉక్రెయిన్ పై వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది. 

Also Read :  మరో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!

300 కి పైగా డ్రోన్లు, 37 క్షిపణులతో దాడి..

తాజాగా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది రష్యా(Russia-Ukraine War). 300 కి పైగా డ్రోన్లు, 37 క్షిపణులను మోహరించింది. దీని కారణంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహా ఎనిమిది ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. రష్యా వదిలిన బాంబుల దాడికి ఆ దేశ విద్యుత్ గ్రిడ్ నాశనం అయిపోయింది. దీంతో ఉక్రెయిన్ లో ఎనిమిది ప్రాంతాలు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ఉక్రెయిన్ జాతీయ ఇంధన సంస్థ ఉక్రెనెర్గో తెలిపింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ DTEK, రాజధాని కైవ్‌లో కూడా విద్యుత్ అంతరాయాలు ఉన్నాయని చెప్పింది. ఇలా రష్యా మౌలిక సదుపాయాలను దెబ్బ తీయడం ఈ నెలలో ఇది ఆరవసారని తెలిపింది. రష్యా రాత్రిపూట ఉక్రెయిన్‌పై 300 కి పైగా డ్రోన్లు, 37 క్షిపణులను ప్రయోగించిందని అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు.  క్లస్టర్ మందుగుండు సామగ్రిని ఉపయోగించి, అత్యవసర సిబ్బంది, గ్రిడ్ మరమ్మతులలో పనిచేస్తున్న ఇంజనీర్లను చంపడానికి రష్యా పదేపదే దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. 

రష్యా ప్రధాన లక్ష్యాల్లో ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్ ఒకటి చెబుతున్నారు. అంతకు ముందు రష్యా ఆర్థిక వ్యవస్థ, యుద్ధ ప్రయత్నాలకు కీలకమైన చమురు శుద్ధి కర్మాగారాలు, సంబంధిత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. అందుకే ఇప్పుడు రష్యా విద్యుత్ గ్రిడ్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

ట్రంప్, జెలెన్ స్కీ భేటీ..

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఓవల్ ఆఫీసులో భేటీ కానున్నారు. ఇందులో అమెరికా నుంచి క్రూయిజ్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థులు, ఉమ్మడి డ్రోన్ ఉత్పత్తి ఒప్పందాలను కోరనున్నారు. దాంతో పాటూ తోమహక్ క్షిపణుల గురించి కూడా ఇరు దేశాధినేతలూ చర్చించనున్నారు. అలాగే రష్యాపై కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను కూడా విధించాలని జెలెన్...ట్రంప్ ను కోరనున్నారు. 

Also Read: H1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్

Advertisment
తాజా కథనాలు