BREAKING: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!

పేద, మధ్య తరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఉచితంగా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

New Update
chandrababu

Cm Chandrababu naidu

పేద, మధ్య తరగతి ప్రజల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పేదవారికి ఉచితంగా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చేపట్టింది. దీనికోసం బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయితే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన - ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ కొత్త ఆరోగ్య విధానాన్ని రూపొందించనున్నారు.

ఇది కూడా చూడండి: AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే కీలక చర్చ!

5 కోట్ల మందికి నాణ్యమైన వైద్యం..

ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్యం అందాలని భావిస్తున్నారు. అయితే ఈ విధానం ద్వారా పెదలకు బీమా కింద రూ.2.50 లక్షల వరకు సేవలు అందిస్తారు. అదే ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ద్వారా రూ.2.50 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వైద్య సేవలు ఇస్తారు. అయితే దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి రూ.2.5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులు కూడా అవకాశం కల్పిస్తోంది. ఈ  పథకం ఉద్యోగులకు కాకుండా మిగతా వారందరికీ కూడా వర్తిస్తుంది. అయితే రూ.2.5 లక్షల బీమా కాకుండా మిగతాబీమా కంపెనీలు ఫస్ట్ చెల్లిస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వం రీయింబర్సు ఇస్తుంది.

వేలకు పైగా వైద్య సేవలు..

ఈ కొత్త విధానంలో 3257 రకాల వైద్య సేవలు ఉంటాయి. అలాగే మొత్తం 324 ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ గుర్తింపు ఇవ్వనున్నారు. అలాగే అనారోగ్యానికి గురైన  వారికి ఆరు గంటల్లోపు ఉచిత వైద్యానికి అవకాశం ఇస్తారు. 15 రోజుల్లోగా ఆ ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. అలాగే ప్రతీ పేషెంట్‌కు క్యూఆర్ కోడ్ ఇచ్చి పర్యవేక్షిస్తారు. అయితే వీటికి ముందుగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ద్వారా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా  చర్యలు తీసుకుంటారు. అలాగే కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కూడా ఏపీ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: AP Govt: ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు పోస్టులు పెడితే జైలుకే!

Advertisment
తాజా కథనాలు