Messi: వామ్మో.. మెస్సీ ఎడమ కాలుకు వేల కోట్ల ఇన్సురెన్స్‌.. భారత్‌లో మ్యాచ్‌ ఆడకపోవడానికి కారణం అదే !

38 ఏళ్ల మెస్సీ ఎడ‌మ కాలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంది. దీని విలువ ఏకంగా 900 మిలియన్‌ డాలర్లు అంటే 7 వేల 600 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన అథ్లెట్‌ బీమా పాలసీలలో ఇది ఒకటి.

New Update
Messi's left foot insurance worth $900 million bars him from playing exhibition match in India

Messi's left foot insurance worth $900 million bars him from playing exhibition match in India

అర్జెంటీనా(argentina) ఫుట్‌బాల్ లెజెండ్(football-player) లియోనెల్ మెస్సీ భారత పర్యటన(lionel messi goat tour to hyderabad)కు రావడం అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో జరిగే GOAT టూర్‌లో భాగంగా మెస్సీ సందడి చేశాడు. అయితే మెస్సీ కేవలం పర్యటనకే పరిమితం అయ్యాడు తప్ప, గ్రౌండ్‌లోకి దిగి ఫుట్‌బాల్ ఆడలేదు. అసలు మెస్సీ, ఇండియాలో ఎందుకు మ్యాచులు ఆడడం లేదు..?  దానికి కారణమెంటో ఓసారి చుద్దాం.

లియోనెల్‌ మెస్సీ..ఈ పేరు వింటేనే ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు పునకాలు వస్తాయి. మెస్సీ తన కెరీర్‌లో ఇప్పటిదాకా 896 గోల్స్‌ చేశాడు. కానీ ఇండియా టూర్‌లో మాత్రం మెస్సీ ఆడలేదు. ఇందుకు ప్రధాన కారణం అతని ఎడమ కాలు. 38 ఏళ్ల మెస్సీ ఎడ‌మ కాలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంది. దీని విలువ ఏకంగా 900 మిలియన్‌ డాలర్లు అంటే 7 వేల 600 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన అథ్లెట్‌ బీమా పాలసీలలో ఇది ఒకటి. ఇది కేవలం అంకె మాత్రమే కాదు, అతని కెరీర్‌కు సంబంధించిన అతిపెద్ద ఆర్థిక భద్రత.

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త స్కీమ్

Messi's Left Foot Insurance Worth $900 Million Bars

ఈ పాలసీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. పాలసీ ప్రకారం మెస్సీ తన సొంతదేశమైన అర్జెంటీనా, తాను ప్రాతినిధ్యం వహించే క్లబ్‌ ఇంటర్‌ మియామి తరఫున అధికారికంగా షెడ్యూల్‌ చేసిన మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. వీటి తరఫున ఆడుతూ గాయపడితేనే మెస్సీకి ఆర్థిక పరిహారం అందుతుంది. అలా కాకుండా అనధికారిక మ్యాచ్‌లు, ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడుతూ గాయపడితే ఈ పాలసీ వర్తించదు. ఒకవేళ ఇండియాలో జరిగే సరదా మ్యాచ్‌లో మెస్సీకి ఏదైనా గాయమైతే, అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు రావు. ఇది అతని కెరీర్‌కు, ఆర్థిక ఒప్పందాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రిస్క్ కారణంగానే, మెస్సీ ఇండియాలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడట.  

Also Read: నేటి నుంచే హెచ్ 1బీ, హెచ్4 వీసాల సోషల్ మీడియా స్క్రీనింగ్..

అయితే బాస్కెట్‌బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌ విషయంలో ఇన్సూరెన్స్‌ పాలసీ భిన్నంగా ఉంటుంది. అతని పాలసీ కాంట్రాక్ట్‌లో లవ్‌ ఆఫ్‌ ది గేమ్‌ అనే క్లాజ్ ఉండేది. దీని వల్ల అతను ఎక్కడైనా, ఎప్పుడైనా బాస్కెట్‌బాల్ ఆడే స్వేచ్ఛ ఉంది. కానీ మెస్సీ విషయంలో ఇలాంటి వెసులుబాటు లేదు.  కేవలం ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీని కారణంగానే మెస్సీ ఇండియా టూర్‌ కేవలం మీట్‌ అండ్‌ గ్రీట్‌ ప్రోగ్రామ్‌లకే పరిమితం అయ్యింది. ఇక ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులైన అథ్లెట్లలో లియోనెల్ మెస్సీ ఒకడు. అతని ఆస్తి విలువ దాదాపు 7 వేల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. మెస్సీ ఆడకపోయినా, అతన్ని దగ్గరగా చూసే అవకాశం దక్కడమే అభిమానులకు పెద్ద పండుగని స్పోర్ట్స్ విశ్లేషకులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు