Man Murdered for insurance : ఇన్సూరెన్స్ డబ్బులకోసం దారుణం..వ్యక్తిని చంపి భార్యగా నమ్మించి...ట్విస్ట్ ఏంటంటే?

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించిందో ముఠా.. అనంతరం ఆ వ్యక్తి భార్యనంటూ ముఠా సభ్యురాలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసింది. అయితే, అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ ముఠా ప్రయత్నం బెడిసికొట్టింది.

New Update
Man Murdered for insurance

Man Murdered for insurance

Man Murdered for insurance :  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించిందో ముఠా.. అనంతరం ఆ వ్యక్తి భార్యనంటూ ముఠా సభ్యురాలు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసింది. అయితే, అసలు భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ ముఠా ప్రయత్నం బెడిసికొట్టింది. పెరాలసిస్ కారణంగా తన భర్త శరీరంలో ఎడమవైపు భాగం పనిచేయడంలేదని, అతడు వాహనం నడపడం సాధ్యం కాదని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు.

కర్ణాటకలోని హోస్పేట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి రూ.5 కోట్లకు జీవిత బీమా చేసుకున్నట్లు ఒక ముఠా తెలుసుకుంది. దీంతో అతడ్ని హత్య చేసి ఆ డబ్బులు పొందేందుకు ప్రయత్నించింది. అనుకున్నట్లే అతన్ని హత్యచేసింది. ఆ తర్వాత ఆ ముఠాకు చెందిన మహిళ నకిలీ భార్యగా నటించింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా వ్యవహారం బయటపడటంతో ముఠా గుట్టు రట్టయింది. వివరాల ప్రకారం కర్ణాటకలోని హోస్పేట్‌కు చెందిన 34 ఏళ్ల గంగాధర్‌కు పాక్షికంగా పక్షవాతం ఉంది. దీంతో ఆయన రూ.5.2 కోట్ల జీవిత బీమా పాలసీ చేయించుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆరుగురు సభ్యులు గల ముఠా గుర్తించింది. ఆ బీమా డబ్బు పొందేందుకు ప్లాన్‌ వేసింది. ఒకరోజు గంగాధర్ ను తీసుకెళ్లి అంతమొందించింది. ఆపై గంగాధర్ మృతదేహాన్ని గ్రామ శివార్లలోకి తీసుకెళ్లి టీవీఎస్ స్కూటర్ పై కూర్చోపెట్టి కారుతో ఢీ కొట్టింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గంగాధర్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ముఠాకు చెందిన హులిగెమ్మ అనే మహిళ బీమా డబ్బుల కోసం తానే గంగాధర్ భార్యనంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించింది.

మరోవైపు సెప్టెంబర్ 28న ఉదయం 5.30 గంటలకు సండూర్ రోడ్డులో హిట్ అండ్ రన్ కేసు గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గంగాధర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శారదమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే అక్కడికి చేరుకున్న ఆయన భార్యకు వాహన ప్రమాదంలో గంగాధర్ చనిపోయాడని పోలీసులు చెప్పారు.. శారదమ్మ సందేహం వ్యక్తం చేశారు. తన భర్త పెరాలసిస్ బారిన పడ్డారని, కోలుకున్నాక శరీరంలో ఎడమవైపు భాగం పనిచేయడంలేదని వివరించింది.కాగా, గంగాధర్‌తో ఆరేళ్ల కిందట తనకు పెళ్లి జరిగినట్లు భార్య శారదమ్మ తెలిపింది. మూడేళ్ల కిందట భర్తకు పక్షపాతం వచ్చిందని, ఎడమ వైపు శరీరంలో చలనం లేదని చెప్పింది.అలాంటి వ్యక్తి టూవీలర్ నడపడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.అతడి భార్యగా పేర్కొన్న హులిగెమ్మ రూ.5.2 కోట్ల బీమా క్లైయిమ్‌ కోసం ప్రయత్నించినట్లు తెలుసుకున్నారు. దీంతో ఆమెతో సహా ఆ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. నేరానికి వినియోగించిన ద్విచక్ర వాహనం, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Also Read :  ఐశ్వర్య సంచలన నిర్ణయం... యూట్యూబ్ పై రూ.4 కోట్ల పరువునష్టం దావా

Advertisment
తాజా కథనాలు