/rtv/media/media_files/2025/08/18/richest-ganpati-2025-08-18-16-20-28.jpg)
Richest Ganpati
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల(ganapati-festivals) కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 27న దేశవ్యాప్తంగా వినాయకుడి పండుగ జరుపుకోనున్నారు. ఇప్పటికే వినాయక మండపాలు అలంకరించడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.వివిధ ఆకృతుల వినాయక విగ్రహాలు, ఖరీదైన మూర్తులు, భారీ సెట్టింగ్‌లు భక్తులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా ముంబయి(mumbai) లోని ఓ గణేశ్ మండపానికి అక్కడి నిర్వహకులు ఏకంగా రూ.474.46 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముంబయి శివారులోని 'మతుంగా ప్రాంతంలో జీఎస్‌బీ సేవా మండల్' గత ఏడు దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది 71వ వార్షికోత్సవం జరగనుంది. దేశంలోనే సంపన్న వినాయకుడు గా ప్రసిద్ధి చెందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈసారి రూ. 474.46 కోట్ల బీమా చేయించారని నిర్వాహకులు వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Dead body in Drum : బ్లూడ్రమ్‌లో భర్త డెడ్ బాడీ.. భార్యాపిల్లలు మిస్సింగ్..
Ganapayya Has An Insurance Of Rs. 474 Crores
ఈ విషయంలో ఎందుకింత బీమా అనే ఆశ్చర్యం కలగడం సహజం. కానీ, అసలు విషయం తెలిస్తే అవునా? నిజమా? అని ముక్కున వేలేసుకుంటారు. అవును మరి. అక్కడి గణపతి దేవున్ని పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. ఇప్పుడే కాదు గత ఏడాది కూడా ఈ మండపానికి రూ.400.58 కోట్ల బీమా కవర్ తీసుకున్నారు. ప్రస్తుతం పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బంది అందరికీ కలిపి రూ.375 కోట్ల వ్యక్తిగత ప్రమాద బీమా చేయించారు. అలాగే గణపయ్యకు అలంకరించే బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా వర్తిస్తుంది. కాగా ఈ గణపతికి గతంలోనూ ఇన్సూరెన్స్ చేయించారు. ఈ మొత్తం 2023లో రూ.38 కోట్లు, 2024లో రూ.43 కోట్లు మాత్రమే ఉండేది. నేడది రూ.400 కోట్లకు చేరుకుంది.
ఇక వినాయక మంటపంలో అగ్నిప్రమాదం, భూకంపం వంటి విపత్తుల సంభవిస్తే దాని కోసం మరో రూ.2 కోట్ల ప్రత్యేక బీమా(Insurance) తీసుకున్నారు. ఇక అక్కడ ఏర్పాటు చేసే ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి రానున్నాయి. మరోవైపు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద రూ.30 కోట్లు కేటాయించారు. అంతేకాదు, భక్తుల సౌకర్యార్థం మంటపంలో ఈసారి QR కోడ్ సేవలు, డిజిటల్ లైవ్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మంటపం వద్ద భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 5 రోజులపాటు జరిగే ఈ గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం వస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జిఎస్‌బి గణేష్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ముంబయి చుట్టై పక్కల ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వస్తారు.
ఇది కూడా చూడండి: Delhi Highway Projects: ఢిల్లీలో అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు: ప్రధాని మోదీ