/rtv/media/media_files/2025/08/27/phonepe-home-insurance-2025-08-27-09-58-46.jpg)
Phonepe home insurance
Phonepe Home Insurance: ప్రకృతి విలయం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. వీటివల్ల మనుషులు, ఇళ్లు, కార్లు, బైక్‌లు, ఇంటి వస్తువులు ఇలా అన్ని కూడా నాశనం అవుతాయి. అయితే కొందరికి ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. వీటివల్ల పోయిన వాటికి డబ్బులు వస్తాయి. అదే ఇన్సూరెన్స్ లేని వారికి ఎలాంటి డబ్బులు కూడా రావు. ఈ రోజుల్లో కష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతీ మనిషికి హెల్త్, టర్మ్, హోమ్ వంటి ఇన్సూరెన్స్‌లు తప్పకుండా ఉండాలి. అయితే మనలో చాలా మందికి హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్‌ల గురించి తెలిసే ఉంటుంది. కానీ హోమ్ ఇన్సూరెన్స్ గురించి సరిగ్గా తెలియదు. డైలీ మనం ఉపయోగించే ఫోన్ పేలోనే హోమ్ ఇన్సూరెన్స్ కడితే కోట్లకు పైగా కవరేజ్ లభిస్తుంది. ఇంతకీ ఈ ప్లాన్ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Stock Market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..బోనస్ షేర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న కంపెనీలు
ఏడాదికి రూ.181లు మాత్రమే..
డిజిటల్ పేమెంట్స్‌లో అగ్రగామి ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే గృహ యజమానుల కోసం ప్రత్యేక హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్(Phonepe Home Insurance) ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అగ్ని, వరదలు, భూకంపాలు, దొంగతనం సహా దాదాపు 20 రకాల రిస్క్‌లు కవరేజ్‌లో ఉంటాయి. అయితే ఈ ప్లాన్ ధర కాస్త ఎక్కువగా ఉంటుందేమో అని చాలా మంది అనుకుంటారు. కానీ రోజుకి కేవలం 50 పైసల ప్లాన్‌తో కోట్ల వరకు కవరేజ్‌ను పొందవచ్చు. ఫోన్‌పేలో రోజుకి 50 పైసలు అనగా వార్షికంగా రూ.181 చెల్లిస్తే చాలు రూ.10 లక్షల నుంచి రూ.12.5 కోట్ల వరకు కవరేజ్ పొందొచ్చు. జీఎస్‌టి కూడా ప్రీమియంలో చేర్చడంతో పాటు తక్కువ ఖర్చుకే అయిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు లేదా ఇంకా ఏవైనా అకస్మాత్తు ప్రమాదాల వల్ల కేవలం ఇల్లు మాత్రమే కాకుండా ఫర్నిచర్, గృహోపకరణాలు, ఇతర విలువైన వస్తువులు కూడా బీమా పొందవచ్చు. అయితే ఫోన్‌పే ఇస్తున్న ఈ ప్లాన్ అన్ని బ్యాంకుల గృహ రుణాలకు కూడా వీలు కుదురుతుంది. అయితే ఈ బీమా అంతా కూడా పూర్తిగా డిజిటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించకుండానే ఇన్సూరెన్స్ పొందవచ్చు.
Digital payments platform PhonePe has launched a home insurance product that allows users to protect their houses and belongings against more than 20 risks, including fire, floods, earthquakes, riots and theft.
— The Mainstream (@TheMainstream7) August 26, 2025
Click here to read the full story:https://t.co/24UAmVktECpic.twitter.com/ZVn0htxpks
ఈ బీమా కావాలని అనుకునే వారు ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి హోమ్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. యాప్ ఓపెన్ చేశాక హోమ్ ఇన్సూరెన్స్ విభాగం ఓపెన్ చేసి ఇంటి విలువను నమోదు చేసి బీమా వ్యవధిని ఎంచుకోవాలి. ఆ తర్వాత యజమాని, ఆస్తి వంటి వివరాలను పొందిపరచాలి. దీంతో పాలసీ జారీ అవుతుంది. ఇంటితో పాటు టీవీ, ఫ్రిజ్, ఏసీ, సోఫా, బెడ్ మొదలైన వాటికి కూడా ఈ పాలసీలో కవరేజ్ లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఫోన్ పే వాడుతున్నారు. వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా చాలా మంది ఈ ఫోన్‌పేని ఉపయోగిస్తున్నారు. లావాదేవీల కోసం ఎక్కువగా విక్రయిస్తున్నారు. అలాంటి వారు ఏడాదికి కనీసం రూ.181 కట్టి ఈ పాలసీ తీసుకోవడం వల్ల విపత్తుల సమయంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Savings Rule: 10-30-50 రూల్‌తో ఈజీగా డబ్బును పొదుపు చేయడం ఎలాగంటే?