Operation Sindoor: 100 మంది ఉగ్రవాదులను లేపేసాం: రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు చూడ్రా.. ఇండియా ఆర్మీ దెబ్బ ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే దేశం నుంచి తరిమికొడతామని హెచ్చరిస్తున్నారు.
కల్నల్ సోఫియా ఖురేషి సాధించిన ఘనతకి ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ గర్వపడుతున్నాని అన్నారు. ఆయన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. తాజ్ మొహమ్మద్ 1971 యుద్ధంలో పాల్గొన్నారు. ఆయనకు అవకాశం వస్తే ఇప్పుడైనా పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తానని మీడియాతో అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియాపైకి మిస్సైల్ దాడికి దిగింది. రాత్రి పంజాబ్‌లో అమృత్సర్ వద్ద క్షిపణితో అటాక్ చేసేందుకు పాక్ ప్రయత్నించింది. భారత్ యాంటి మిస్సైల్ వ్యవస్థ పాకిస్తాన్ మిస్సేల్ని గాల్లోనే ధ్వంసం చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది భారత్. తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దాడి ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారత సైనిక రైళ్ల కదలికల గురించి తెలుసుకోవడం కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రయత్నించవచ్చనే సమాచారం వచ్చింది. దీంతో రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులతో షేర్ చేయవద్దని రైల్వేశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశామైయ్యారు. ఎయిర్ స్ట్రైక్‌కు గురించి వారికి వివరించారు. అమెరికా, UK, సౌదీ అరేబియా, జపాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశామని..హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఫైటర్ జెట్లలో నుంచి ఉగ్రవాద స్థావరాలను ఎలా టార్గెట్ చేసి దాడులు చేశారనేది ఇందులో ఉంది. ఆపరేషన్ సంబంధించిన వివరాలతో వీడియోలను ఆర్మీ ఎక్స్‌లో విడుదల చేసింది.