IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 23) ఈ మ్యాచ్ జరుగుతోంది.
IND vs PAK: పాక్‌పై భారత్ ఘనవిజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 42.3 ఓవర్లలో 242 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేశాడు.
IND vs PAK: గెలుపు దిశగా టీమిండియా.. సెంచరీకి చేరువలో కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 36 ఓవర్లలో టీమిండియా స్కోర్ 200 పరుగులు దాటింది. గెలుపు దిశగా టీమిండియా వెళ్తుంది. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ పరుగులతో రాణిస్తున్నారు. హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు.
IND vs PAK Champions Trophy 2025: నిలకడగా ఆడుతున్న భారత్ ఆటగాళ్లు.. 26 ఓవర్లకు టీమిండియా స్కోర్ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడుతున్నారు. కోహ్లీ 61 బాల్‌లకు 47 స్కోర్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ 27 బంతులకు 12 పరుగులు తీశాడు. 26 ఓవర్లకు మొత్తం స్కోర్ 128 ఉంది.
IND vs PAK: పాకిస్థాన్ ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియా 242 పరుగులు చేస్తేనే పాక్‌పై విజయం సాధిస్తుంది.
IND vs PAK: మొదటి ఓవర్లో షమీ చెత్త రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పేసర్ మహమ్మద్ షమీ చెత్త రికార్డును నమోదు చేశాడు. మొదటి ఓవర్లో ఐదు వైడ్లు వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఇది వరకే జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్లు ఉండగా.. వారి సరసన కూడా షమీ చేరాడు.
IND vs PAK: టాస్ ఓడిన టీమిండియా.. పాక్ బ్యాటింగ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు లేవు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నారు.
IND vs PAK : పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ..కీలక ప్లేయర్ ఔట్!
పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్ కు దూరమవుతున్నట్లుగా తెలుస్తోంది. కంటి దురద కారణంగా బాబర్ నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు హాజరుకాలేదు. దీంతో భారత్ తో ఇవాళ జరగబోయే మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది.