/rtv/media/media_files/2025/09/15/pakistan-fans-reaction-2025-09-15-11-47-15.jpg)
Pakistan Fans Reaction
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా నిన్న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిభరితంగా ఉంటుందని క్రికెట్ అభిమానులు, ప్రియులు అనుకున్నారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. పాకిస్తాన్ మొదటి నుంచే చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.
asia cup 2025 india won the match
అనంతరం 128 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు 7 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఫినిష్ చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను అలవోకగా ఛేధించింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగానే దేశమంతా సంబరాలు మిన్నంటాయి. మరోవైపు పాక్ ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు, బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంపై అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా మ్యాచ్ ముగిసిన తర్వాత దుబాయ్ క్రికెట్ స్టేడియం బయట నిలబడి తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఒక పాక్ అభిమాని మాట్లాడుతూ.. ‘‘ మా ప్లేయర్లు పనికిరాని ఆట ఆడారు. బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ సరైన ప్రదర్శన కనిపించలేదు. జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడు లేడు. బాబర్, రిజ్వాన్ కూడా లేరు.
Pakistani cricket fan says, "I had a lot of hope, but the Pakistan team really disappointed us."
— Saffron_Syndicate (@SaffronSyndcate) September 14, 2025
Ye Rona band nahi hona chahiye😆😆😆
Ramdi Rona of pakistanis#IndiaVsPakistan#AsiaCup#Pakistanpic.twitter.com/TU3TXkzRBK
భారత్, పాక్ మధ్య ఎంతో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుందని భావించాము. కానీ అది అస్సలు జరగలేదు. సెప్టెంబర్ 21న సూపర్ ఫోర్ కింద రెండు దేశాల మధ్య మరో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌కు మేము అస్సలురాబోము. నేను చాలా డబ్బు ఖర్చు చేసి అబుదాబి నుండి ఇక్కడికి వచ్చాను. కానీ ఆటలో ఎలాంటి ఉత్సాహం లేదు. టెన్షన్ పడే అవకాశం రాలేదు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఏకపక్షంగా ఉంది. ఈ మ్యాచ్ ఆగిపోయి ఉంటే కనీసం సరదాగా ఉందని చెప్పుకునేవాళ్లం.
ఇది చాలా బాధాకరం. మా జట్టులోని ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేకపోయారు. క్యాచ్‌లను పట్టుకోలేకపోయారు, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో సరైన ఆటతీరు కనబరచలేకపోయారు. భారతదేశం బాగా ఆడింది. మా జట్టు ఆడిన తీరు చూసి.. వెంటనే ఆకలి వేసింది. దీంతో తినడానికి ఎక్కడికి వెళ్లాలో ఆలోచించుకోవడం మొదలెట్టాం. ఏది ఏమైనా మా జట్టు ప్రయాణం ముందుకు సాగుతుందని మేము ఆశిస్తున్నాము’’ అని తెలిపారు.