BCCI : అదేమీ రూల్‌ కాదు..: పాక్‌కు బీసీసీఐ కౌంటర్!

దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

New Update
bcci

ఆసియా కప్‌(Asia cup 2025)లో పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌(India-Pakistan Match) అనంతరం పాక్ క్రికెటర్లను టీమిండియా(team-india) ఆటగాళ్లు పట్టించుకోలేదు. పాక్‌ ప్లేయర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్‌కి ముందు అంటే టాస్ వేసే సమయంలో ఓ భాగం. మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్స్ ఇస్తారు. అయితే షేక్ హ్యాండ్ కోసం చూసి టీమిండియా ప్లేయర్లు రాకపోవడంతో.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా డ్రస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. భారత్‌తో మ్యాచ్‌ ఓటమితో పాక్‌ అభిమానులు ఆ జట్టుపై మండిపడుతున్నారు.  మావాళ్లు వేస్ట్‌గాళ్లు అంటూ క్రికెట్లరపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్‌ హెడ్ కోచ్ మ్యాచ్ అనంతరం భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఇది చాలా నిరుత్సాహకరమని, తాము షేక్ హ్యాండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. 

అయితే దీనిపై బీసీసీఐ స్పందించింది. కరచాలనం చేయడం అనేది ఆటగాళ్ల మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమేనని, క్రీడా నియమాలలో అది తప్పనిసరి కాదని బీసీసీఐ(bcci) అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో, క్రీడాస్ఫూర్తికి మించిన కొన్ని విషయాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం బీసీసీఐ, భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తీసుకున్నారని కూడా వెల్లడైంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తమ జట్టుకు బీసీసీఐ, ప్రభుత్వ మద్దతు ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మ్యాచ్ రిఫరీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.  

Also Read :  చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు

హై-వొల్టేజ్ మ్యాచ్‌లో భారత్ విజయం

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  ఈ హై-వొల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ (3/18),  అక్షర్ పటేల్ (2/18) అద్భుత ప్రదర్శన చేశారు. భారత్ కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్), తిలక్ వర్మ (31), ఓపెనర్ అభిషేక్ శర్మ (31) బ్యాటింగ్‌లో రాణించారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. 

Also Read :  వీడియో: మా ఆటగాళ్లు పనికిరారు.. పాక్ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్

Advertisment
తాజా కథనాలు