IND vs PAK : మళ్లీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది.  సూపర్ 4లో ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ పై పాక్ ఘోరంగా ఓడిపోయింది.

New Update
India

ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరగనుంది.  సూపర్ 4లో ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన ఇరు జట్లు తలపడనున్నాయి.దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది.  

Also Read :  Iran-Israel: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్

ఇప్పటికే గ్రూప్ స్టేజీలో భారత్ పై పాక్ ఘోరంగా ఓడిపోయింది.   ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ రెండూ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఈ రెండు జట్ల మధ్య ఆసియా కప్ 2025లో మూడోసారి మ్యాచ్ జరుగుతుంది.ఇక గ్రూపు ఏ నుంచి భారత్, పాక్ సూపర్ 4కు క్వాలిఫై అయ్యాయి. సూపర్ 4లో ఒక్కో జట్టు మూడు మ్యాచులు ఆడనుంది. అటు గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్,  అఫ్గానిస్తాన్ సూపర్ 4లో ఉన్నాయి.

Also Read : Pakistan cricket : సిగ్గులేని పాక్..ఎంతకు తెగిచిందంటే?

41 రన్స్ తేడాతో గెలుపు 

మరోవైపు నిన్న జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు UAEపై 41 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో  ఫకర్ జమాన్(50), షాహీన్ అఫ్రీది(29*), సల్మాన్ అఘా(20) రాణించారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రన్ జిత్ 3, ధ్రువ్ 1 వికెట్ తీశారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో UAE కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాహుల్ చోప్రా(35), ధ్రువ్(20) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రీది, అబ్రార్, రౌఫ్‌లు తలో 2 వికెట్లతో రాణించారు.

Also Read :  Yogi Adityanath : దటీజ్ యోగి.. దిశాపటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు ఖతం !

ఒకవేళ UAEతో మ్యాచ్‌ను పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టపోయేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు రూ. 145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా బాయ్‌కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ఐసీసీకి చెల్లించాల్సి ఉండేది. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేది. కానీ చివరకు పాక్ తలొగ్గి మ్యాచ్ కు సిద్దమైంది. గంట తరువాత ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 

Also Read : Breaking: ఏడీఈ అంబేడ్కర్‌కు మరో షాక్‌.. స్నేహితుడి ఇంట్లో అక్రమాస్తులు గుర్తించిన ACB

Advertisment
తాజా కథనాలు