Sahibzada Farhan : ఏరా ఇది మ్యాచ్ అనుకున్నావా.. యుద్ధం అనుకున్నావా.. ఫర్హాన్ పై ఫైర్ !

దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో  పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన హాఫ్ సెంచరీని వివాదాస్పదంగా సెలెబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

New Update
pak

దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో  పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన హాఫ్ సెంచరీని వివాదాస్పదంగా సెలెబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అతను తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే తన బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని, ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపినట్లుగా సంజ్ఞ చేశాడు.

ఈ సంఘటన భారత అభిమానుల నుంచి, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. భారత్, పాకిస్తాన్‌కు మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఇలాంటి సంజ్ఞలు చాలా సున్నితమైనవిగా పరిగణించబడతాయి. ఈ ఏడాది జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడిలో భారత పౌరులు మృతి చెందిన నేపథ్యంలో అతను చేసిన ఈ చచర్యపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 

Also Read :  Abhishek Sharma : వాటే ఇన్నింగ్స్.. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

క్రికెట్‌ను రాజకీయాలు, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలతో కలపడం సరికాదని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. కొందరు అభిమానులు ఈ చర్యను సిగ్గుచేటు, అవమానకరంగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు.

ఈ వివాదాస్పద సెలెబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఫర్హాన్ చర్యపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, అతను ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. మ్యాచ్‌లో ఫర్హాన్ 34 బంతుల్లో 50 పరుగులు చేసి, పాకిస్తాన్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశాడు. కానీ అతని ఆట కంటే అతని వివాదాస్పద సెలెబ్రేషనే ఇప్పుడు ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. 

6 వికెట్ల తేడాతో విజయం

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని  నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం కావడం విశేషం. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అటు పాకిస్థాన్ మంగళవారం శ్రీలంకతో తలబడనుంది. 

Also Read : OG Trailer: దానయ్య తాత.. ఓజీ ట్రైలర్ ఇంకెప్పుడు.. హార్డ్ డిస్క్ ఎవరైనా ఎత్తుకెళ్లారా?

Advertisment
తాజా కథనాలు