/rtv/media/media_files/2025/09/22/yuvi-2025-09-22-07-02-44.jpg)
ఆసియా కప్(Asia cup 2025) సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్(pakistan) తో జరిగిన పోరులో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(abhishek-sharma) అద్భుతమైన రికార్డు సృష్టించాడు. కేవలం తన 20వ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లోనే 50 సిక్సర్లు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ కేవలం 331 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఎవిన్ లూయిస్ (366 బంతులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డులో రసెల్, హజ్రతుల్లా జజాయ్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లను అభిషేక్ అధిగమించాడు.
Also Read : IND vs PAK : పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. సూపర్ ఫోర్ మ్యాచ్‌కు కూడా అతనే
T20I లలో అతి తక్కువ బంతుల్లో 50 సిక్సులు
331 బంతులు - అభిషేక్ శర్మ (భారత్ )
366 బంతులు - ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)
409 బంతులు - ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్)
492 బంతులు - హజ్రతుల్లా జజాయ్ (ఆఫ్ఘనిస్తాన్)
510 బంతులు - సూర్యకుమార్ యాదవ్ (భారత్ )
ఇన్నింగ్స్‌ల పరంగా కూడా అభిషేక్ శర్మ, ఎవిన్ లూయిస్ రికార్డును సమం చేశాడు. ఇద్దరూ తమ టీ20 కెరీర్‌లో 20వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు. పాకిస్తాన్‌పై 74 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో, అభిషేక్ శర్మ ఈ రికార్డును నెలకొల్పాడు. ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో అతని మెరుపు ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఇక ఈ మ్యాచ్ లో 24 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన అభిషేక్, తన గురువు యువరాజ్ సింగ్ పాకిస్థాన్‌పై టీ20లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2012 డిసెంబర్ 28న అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌లో, యువరాజ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 29 బంతులు ఎదురుకున్నాడు.
🚨 𝑴𝑰𝑳𝑬𝑺𝑻𝑶𝑵𝑬 🚨
— Kanak Kumari (@KanakKu64995524) September 21, 2025
Abhishek Sharma completes 50 sixes in T20Is, becoming the fastest Indian to reach this milestone in just 20 innings. 🇮🇳👏[Sportskeeda]#T20Is#INDvPAK#AbhishekSharmapic.twitter.com/Gzc7jdUoTM
6 వికెట్ల తేడాతో విజయం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం కావడం విశేషం. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అటు పాకిస్థాన్ మంగళవారం శ్రీలంకతో తలబడనుంది.