IND vs PAK : టీమ్ ఇండియా తో మ్యాచ్.. పాకిస్తాన్ బ్యాటింగ్

ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌లో భాగంగా భారత్‌, పాక్‌ జట్లు దుబాయ్‌ వేదికగా మ్యాచ్ ప్రారంభం అయింది. ముందుగా టాస్‌ గెలిచిన భారత జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ కు ష్యేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. 

New Update
ind vs pak

భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ తమ తమ జట్లలో రెండు మార్పులు చేశాయి. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాలలో  జస్‌ప్రీత్ బుమ్రా,  వరుణ్ చక్రవర్తిని భారత్ జట్టులోకి తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్ ఖుష్దిల్ షా, హసన్ నవాజ్ స్థానాలలో  హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షాలను తీసుకువచ్చింది. రిషబ్ పంత్ గాయపడటం సంజు శాంసన్ కు అదృష్టమని, లేకుంటే అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించదని సునీల్ గవాస్కర్ అన్నారు. 

జట్లు:

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి

Advertisment
తాజా కథనాలు