IPS Officers: పోలీసు కమిషనర్‌గా సజ్జనార్.. తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ
తెలంగాణాలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్‌ను నియమించింది.