TG News: IAS అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. రెస్ట్ తీసుకోమంటూ!

తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్‌ లు మండిపడుతున్నారు. 

New Update
MLA Matta Ragamayee

MLA Matta Ragamayee Photograph: (MLA Matta Ragamayee )

TG News: తెలంగాణ IAS అధికారులపై సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌ కావడానికి బాగా కష్డపడి చదివి జాబ్ రాగానే రిలాక్స్ అవుతారని సత్తుపల్లి కాంగ్రెస్ నేతల సమావేశంలో అన్నారు. దీంతో దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ ఐఏఎస్‌ లు మండిపడుతున్నారు. 

రిల్సాక్స్ కావొద్దు..

ఈ మేరకు శనివారం సత్తుపల్లి కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆమె పాల్గొన్న ఆమె పనుల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అవ్వడానికి బాగా కష్టపడి చదువుతారు.. ఒకసారి ఐఏఎస్ అయ్యాక రిలాక్స్ అయిపోయి ఏం పని చెయ్యరు. మీరు ఐఏఎస్ అధికారుల లాగా కావొద్దని ఈ మాట రేవంత్ రెడ్డి తమకు చెప్పాడన్నారు. అలాగే సీఎంను, మంత్రులను అందరూ తిట్టినా తమ నేతలు కౌంటర్లు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

మాకెందుకులే అన్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే ఎమ్మెల్యే రాగమయి వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ అత్యున్నత సర్వీస్ వ్యవస్థను కించపరిచారంటూ మండిపడుతున్నారు. రాగమయి క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

కాంగ్రెస్‌ కుటుంబమే

ఇక వృత్తిరిత్యా డాక్టర్‌ మట్టా రాగమయి.. తెలంగాణ శాసనసభలో తొలిసారిగా అడుగుపెట్టిన ఉన్నత విద్యావంతుల్లో ఒకరు. ఒకవైపు ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలిగా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే నిజంగా తాను ఎమ్మెల్యే అవుతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. అత్తమ్మ ఆరోగ్యమ్మ స్ఫూర్తి, తన భర్త డాక్టర్‌ దయానంద్‌ ప్రేరణతోనే శాసనసభలో అడుగుపెట్టానని గెలిచిన సందర్భంగా చెప్పారు. మొదటి నుంచి తమది కాంగ్రెస్‌ కుటుంబమేనని, అత్తమ్మ మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారని గుర్తు చేశారు. మామయ్య కృష్ణమూర్తి జాతీయోద్యమకాలం నుంచి కాంగ్రెస్‌ వాది, స్వాతంత్య్ర సమరయోధుడు కూడా అని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు