/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
తెలంగాణాలో 23 మంది ఐపీఎస్ అధికారులను(ips-officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్(sajjanar) ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్‌ను నియమించింది. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, ఫౌరసరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర, గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డిజీగా అనిల్ కుమార్‌కు ఇచ్చారు.
Also Read : HYD Floods: పండుగకు ఊరెళ్లే వారికి అలర్ట్.. MGBS మూసివేత.. బస్సులు ఎక్కడ ఎక్కాలంటే?
Telangana In 23 IPS Officers Transferred
📢 IAS Transfers & Postings – Telangana
— IPRDepartment (@IPRTelangana) September 27, 2025
Govt. has issued a G.O ordering transfers, postings & FAC arrangements of IAS officers in the state.
🔹 Syed Ali Murtaza Rizvi (IAS 1999) – FAC Prl. Secy (Poll), GAD
🔹 M. Raghunandan Rao (IAS 2002) – Commissioner, Commercial Taxes & FAC… pic.twitter.com/f454AN6lGZ
Also Read : 800 ఏళ్లనాటి భూపతిస్ పర్పుల్ కప్పని కాపాడటానికి హైదరాబాద్ శాస్త్రవేత్తలు!
మల్టీజోన్ 2 ఐజీగా డీఎస్ చౌహన్, విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ నేర విభాగ అదనపు సీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్, సిద్దిపేట కమిషనర్‌గా ఎస్.ఎమ్ విజయ్ కుమార్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సింధు శర్మ, నారాయణపేట ఎస్పీగా జి. వినీత్, ఎల్బీనగర్ డీసీపీగా బి. అనురాధ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా సీహెచ్ ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, వెస్ట్ జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, మాదాపూర్ డీసీపీగా రితు రాజ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా రవి గుప్తాను ప్రభుత్వం నియమించింది.