అయ్యో పాపం.. IAS అధికారిణికి భర్త వేధింపులు..

రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారిణి గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Rajasthan IAS officer alleges domestic violence by IAS husband; FIR filed

Rajasthan IAS officer alleges domestic violence by IAS husband; FIR filed

రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఐఏఎస్ అధికారిణి గృహహింస వేధింపులకు గురవుతున్నారు. తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్కడి ప్రభుత్వ ఆర్థిక శాఖలో జాయింట్‌ సెక్రటరీగా భారతి దీక్షిత్ అనే ఐఏఎస్ అధికారిణి విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె గృహహింస వేధింపుల కేసులో జైపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. 

Also read: ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే ?

ఆమె భర్త ఆశిష్‌ కూడా ఐఏఎస్‌ అధికారే కావడం గమనార్హం. ఆయన సామాజిక న్యాయం, సాధికారత విభాగంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని.. కొన్నిరోజుల నుంచి ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు అత్తింటివారి నుంచి తన ప్రాణాలకు హానీ ఉందని జైపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014లో తమకు వివాహం జరిగిందని.. అప్పటి నుంచి ఆశిష్ తరచూ మద్యం సేవిస్తూ తనను వేధిస్తున్నాడని వాపోయారు. తామిద్దరం 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ IAS అధికారులమని తెలిపారు.  

Also Read: ఢిల్లీ బ్లాస్ట్‌ వెనుక నలుగురు డాక్టర్ల కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!

పలువురు నేరస్థులతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. గత నెలలో ఆశిష్, అతడి స్నేహితులు కలిసి తననకు ఓ ప్రభుత్వ వాహనంలో బలవంతంగా తీసుకెళ్లి చాలా గంటల పాటు  నిర్బంధంలో ఉంచినట్లు ఫిర్యాదులో తెలిపారు. విడాకులు తీసుకోకపోతే తననకు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆశిష్‌ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Advertisment
తాజా కథనాలు