Ap Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్‌కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్‌లకు ప్రమోషన్‌లు వచ్చాయి. ఈ మేరకు వారికి పదోన్నతి కల్పిస్తూ ఏపీప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌లు సురేష్‌కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్‌లకు ముఖ్య కార్యదర్శి హోదాలు లభించాయి. Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! ప్రస్తుతం సాల్మన్ ఆరోక్యరాజ్ డిప్యూటేషన్ పై కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. సురేష్ కుమార్‌ను పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్, కార్తికేయ మిశ్రా, సీహెచ్ శ్రీధర్‌లకు కార్యదర్శి హోదాను ప్రభుత్వం ఇచ్చింది. Also Read: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ కార్తికేయ మిశ్రా ప్రస్తుతం సీఎంవోలో సహాయ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు అక్కడే సీఎంవో కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చారు. వీరపాండ్యన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా ఉన్నారు. శ్రీధర్‌ను కడప జిల్లా కలెక్టర్‌గానే కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్‌కు పదోన్నతి కల్పించారు.. వీరిద్దరు సీనియర్ ఎస్పీలుగా ప్రమోషన్స్ పొందారు. Also Read: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా కె విజయానంద్ అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం సీఎస్‌గా పదవీ విరమణ చేసిన నీరబ్‌కుమార్ ప్రసాద్.. విజయానంద్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ముందుగా సచివాలయం మొదటి బ్లాక్లో ప్రత్యేక పూజల అనంతరం సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. Also Read: Year Ender 2024: కలిసి రాని కాలం.. ఫాంహౌస్ లో KCR, జైలుకు కవిత, కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు! ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయానంద్ చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అలాగే ఉద్యోగ విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసార్ కి ఉద్యోగులు వీడ్కోలు చెప్పారు. విజయానంద్‌ను పలువురు ఐఏఎస్‌లు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.