Houthi-Isreal: హౌతీలకు ఇజ్రాయెల్ హెచ్చరిక.. మీ నాయకుడే మా టార్గెట్
హౌతీ నియంత్రణలో ఉన్న ఓడరేవులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగా హౌతీలు ఎదురు తిరిగితే అబ్దుల్ మాలిక్ అల్-హౌతీని చంపేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. రక్షణ మంత్రి మాటలకు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సపోర్ట్ చేశారు.