/rtv/media/media_files/2025/07/28/houthis-latest-warning-2025-07-28-19-34-42.jpg)
Houthis' latest warning
Houthis: గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణహోమం తెలిసిందే. కాగా గాజాలోని పాలస్తీన్లకు యెమెన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రెబల్ గ్రూప్ హూతీ మద్దతునిస్తోంది. ఈ క్రమంలో హూతీ గ్రూపు కీలక తీవ్ర హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌తో వ్యాపారం చేసే వాణిజ్య నౌకలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. అవి ఏ దేశానికి చెందిన నౌకలైనా, ఏ సంస్థవైనా వెనకాడబోమని వారు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. వారు గతంలో ప్రకటించినట్లే ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్ పోర్టులకు వెళ్తున్న వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. అయినా ఇజ్రాయెల్ గాజా మీద తన దాడులను ఆపలేదు. దీంతో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులను మరింత ఉద్ధృతం చేయాలని, ఆ దేశం వైపు వెళ్లే నౌకలను పూర్తిగా దిగ్బంధించాలని హూతీలు నిర్ణయించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read: షాకింగ్ వీడియో.. ఘోర రైలు ప్రమాదం - ప్రాణాలు వదిలిన ప్రయాణికులు
‘‘ఏ దేశానికి చెందినవైనా, ఏ కంపెనీకి చెందిన నౌకలైనా మాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్ పోర్టుల వైపు వెళ్లిన ప్రతి వాణిజ్య నౌకపైనా దాడులు చేస్తాం. మా సైనిక చర్య ఆగాలంటే.. గాజాపై యుద్ధాన్ని ఆపాలని, పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లాలని, ఆ దేశంతో వాణిజ్యం చేస్తున్న దేశాలే ఒత్తిడి తీసుకురావాలి.’’ అని హూతీలు తాజా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ వైపు వెళ్తున్న రెండు నౌకలపై దాడి చేసిన హూతీలు వాటిని సముద్రంలో ముంచేశారు.
Also Read: వీడేం పోలీసురా...ప్రేమ పెళ్లి.. ఆపై వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకుని...
లైబీరియాకు చెందిన బల్క్ క్యారియర్ ‘మ్యాజిక్ సి’పై న డ్రోన్లు, మిస్సైళ్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడులు, ఇతర ఆయుధాలతో హుతీలు దాడి చేశారు. ఆ సమయంలో అందులో ఉన్న 22 మంది సిబ్బంది నౌకను వదిలి ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆ నౌకను సముద్రంలో ముంచేసినట్లు హూతీలు ప్రకటించారు. మరోవైపు గ్రీక్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఎటర్నిటీ సి’ కార్గో నౌక ఉత్తరంవైపు సూయజ్ కాలువ దిశగా వెళుతుండగా దానిపైనా కూడా దాడి చేశారు. చిన్న పడవల్లో వచ్చిన హూతీలు కార్గోపై కాల్పులు జరిపారు. దీంతో నౌకలో ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఘర్షణలో ముగ్గురు నావికులు మరణించారు. కాగా, నవంబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 మధ్య దాదాపు100 వాణిజ్య నౌకలపై హూతీలు దాడులకు పాల్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి.
Also Read: మిట్టమధ్యాహ్నం రెచ్చిపోయిన అంకుల్.. ఆంటీతో బైకుపై బంచిక్బంచిక్