Israel-Houthis: ఇజ్రాయెల్‌పై విరుచుకుప్డడ హౌతీలు.. ఎయిర్‌పోర్టుపై దాడులు

గాజానా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్‌ అక్కడ దాడులు కొనసాగిస్తూనే ఉంది. అలాగే హౌతీలతో కూడా తన వైరాన్ని కొనసాగిస్తోంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు.

New Update
Flights resume at Israel's Ramon Airport after Houthi drone strike

Flights resume at Israel's Ramon Airport after Houthi drone strike

ఈ దాడులు జరగడంతో ఎయిర్‌పోర్టులో సుమారు రెండు గంటల పాటు రాకపోకలు నిలిపివేశారు. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. హౌతీలు ప్రయోగించిన మూడు డ్రోన్లను తమ భూభాగంలోకి రాకముందే నేలకూల్చామని ఇజ్రాయెల్‌ ఆర్మీ పేర్కొంది. కానీ ఒక డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్లు పేర్కొంది. దీనిపై విచారణ కూడా చేపట్టామని తెలిపింది. ఈ దాడులు జరగడంతో దక్షిణ ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా సైరన్లు మోగడంతో అక్కడి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. 

Also Read: ఆకాశంలో అద్భుతం.. చంద్రగ్రహణం వీడియోలు, ఫొటోలు చూశారా?

కొన్నిరోజుల క్రితం యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో హౌతీల ప్రభుత్వ ప్రధానమంత్రి అహ్మద్‌-రహావీ మృతి చెందడం సంచలనం రేపింది. దీంతో ఇది హౌతీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదలైన తర్వాత హౌతీలు పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌కు సంబంధించిన వాణిజ్య నౌకలు కనిపిస్తే వాటిపై కూడా దాడులు చేస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్‌ హౌతీలను కూడా లక్ష్యంగా చేసుకోని వారిపై దాడులకు పాల్పడుతోంది. ఆదివారం హౌతీల దాడుల అనంతరం ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్టు సేవలను ప్రారంభించింది. 

Also Read: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్.. ‘ఆ విషయంలో ధైర్యం తెచ్చుకోండి’

మరోవైపు గాజాలో చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. గాజా నుంచి హమాస్‌ను నిర్మూలించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే ముందస్తు చర్యలు ప్రయత్నాలు చేపట్టేందుకు ఇప్పటికే లక్షలాది మంది పాలస్తీనియన్ల నగరం విడిచి వెళ్లిపోయారని తెలిపారు. అయితే ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.    

Also Read: ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఐటీ..కాపాడుకుంటామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Advertisment
తాజా కథనాలు