/rtv/media/media_files/2025/03/16/bvPQeR2uj5uyQfgMVjDl.jpg)
US launches wave of air strikes on Yemen's Houthis, 31 Killed
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం యెమెన్‌లో ఉన్న హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు. మరో 101 మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని హౌతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది.
Also Read: ఘోర అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా మృతి
మరోవైపు అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడులు చేస్తే సహించేది లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ తేల్చిచెప్పింది. అయితే అమెరికా చేసిన దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. దీన్ని యుద్ధ నేరంగా అభివర్ణించింది. అంతేకాదు యెమెన్ దళాలు అమెరికాతో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చింది.
Also Read: పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ దాడి.. 90 మంది సైనికులు మృతి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హౌతీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌతీలు మీ సమయం వచ్చేసింది. వెంటనే దాడులు ఆపేయండి. లేకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రవాదులు ఆపలేరంటూ తేల్చిచెప్పారు. అంతేకాదు హౌతీలకు మద్దతు ఇవ్వడాన్ని ఆపేయాలంటూ ఇరాన్‌ను కూడా హెచ్చరించారు. హౌతీల చర్యలకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ధ్వజమెత్తారు.
Also Read: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Also Read: తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం