Israel-Houthis: భీకర దాడులు.. యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం..

ఇజ్రాయెల్‌పై గతంలో హౌతీ రెబల్స్‌ మిసైల్స్‌ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాపై కాల్పులు జరుపుతూనే ఉంది. అలాగే హౌతీలపై ప్రతీకారంలో భాగంగా తాజాగా యెమెన్‌ రాజధాని సనాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.

New Update

 ఇజ్రాయెల్‌పై గతంలో హౌతీ రెబల్స్‌ మిసైల్స్‌ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాపై కాల్పులు జరుపుతూనే ఉంది.  అలాగే హౌతీలపై ప్రతీకారంలో భాగంగా తాజాగా యెమెన్‌ రాజధాని సనాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఆదివారం జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందినట్లు హౌతీ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్‌ యెమెన్‌పై ఏడాదిన్నర తర్వాత దాడులు చేయడం ఇదే మొదటిసారి. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడులు చేసిన అనంతరం ఇజ్రాయెల్‌ రంగంలోకి దిగింది. గాజాపై దాడులు చేస్తూనే ఉంది. 

Also Read:  ఇక మోదీ పెద్దన్న.. ట్రంప్కు జెలెన్స్కీ ఊహించని షాక్.. రష్యా-ఉక్రెయిన్ వార్లో బిగ్ ట్విస్ట్!

ఆ తర్వాత హౌతీ రెబల్స్‌ కూడా ఇందులో జోక్యం చేసుకున్నారు. ఇజ్రాయెల్‌పైకి మిసైల్స్‌తో విరుచుకుపడ్డారు. అందుకే హౌతీలపై ప్రతీకారంలో భాగంగానే తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దళాలు యెమెన్ రాజధానిలో విరుచుకుపడ్డాయి. ఓ ప్రాంతంలో ఇజ్రాయెల్ వేసిన బాంబుల దాటికి భారీగా మంటలు సంభవించాయి. పెద్దఎత్తున మంటలు పైగి ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యెమెన్‌లో అధ్యక్షుడి ప్యాలెస్ ఉన్న సైనిక భవనం ప్రాంగణం, రెండు పవర్ ప్లాంట్లు, ఫ్యూయెల్ స్టోరెజ్‌ సైట్‌లు తమ లక్ష్యాలని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు