Hardik Pandya - Esha Gupta: హార్దిక్ పాండ్యతో డేటింగ్‌పై నటి ఇషా ఫుల్ క్లారిటీ.. ‘రెండు మూడుసార్లు కలిశాం’
హార్దిక్ పాండ్యతో డేటింగ్ వార్తలపై నటి ఇషా గుప్తా స్పందించారు. కొంతకాలం తమ మధ్య స్నేహం ఉందన్నారు. తాము డేటింగ్ దశలోకి అడుగుపెట్టకముందే అంతా ముగిసిపోయిందన్నారు. కొన్నినెలల పాటు సాగిన తమ మధ్య అనుబంధంలో రెండు మూడు సార్లు కలిశామని చెప్పారు.